రాగానే, మంత్రి వేధింపులు: సీఎంకు అంజు ఫిర్యాదు

తిరువనంతపురం: కేరళకు చెందిన క్రీడాకారిణి, ఒలింపియన్, స్టార్ లాంగ్ జంపర్ అంజు బాబు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను కలిసి క్రీడాశాఖ మంత్రి ఈపీ జయరాజన్ పైన ఫిర్యాదు చేశారు. సదరు మంత్రి తనను వేధిస్తున్నారని ఆమె ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాుద చేయడం సంచలనం రేపింది.

కొత్తగా పదవిలోకి వచ్చిన క్రీడాశాఖ మంత్రి తనను వేధిస్తున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు. అంజూ బాబీ రాష్ట్ర క్రీడా కౌన్సెల్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రాష్ట్రానికి క్రీడా శాఖ మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జయరాజన్‌తో అంజూ, కౌన్సెల్ సభ్యులు ఇటీవల సమావేశమయ్యారు.

Olympian Anju Bobby George is furious with Kerala's sports minister

ఆ సందర్భంలో మంత్రి తమను అవమానించారని, వేధింపులకు గురిచేశారని అంజూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను అవినీతిపరులని, ప్రతిపక్ష పార్టీకి మద్దతుదారులమని ఆరోపించినట్లు ఫిర్యాదు చేశారు.

తాము ఏ పార్టీకి చెందిన వారం కాదని, తమది క్రీడా పార్టీ అని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో లేదా కమ్యూనిస్ట్ పార్టీలో లేదా బీజేపీలో సభ్యురాలిని కాదని చెప్పారు. తాను ఓ క్రీడాకారిణిగా ప్రభుత్వానికి మాత్రమే మద్దతిస్తానని పేర్కొన్నారు. ఏ పార్టీకి మద్దతివ్వనని చెప్పారు. అంతేకాక, ఎవరి నుంచి తాము డబ్బు తీసుకోబోమని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+