నిర్భంధం నుండి బయటకు వచ్చే వరకు గడ్డం తీయను : ఒమర్ అబ్దుల్లా
గృహ నిర్భంధంలో ఉన్న కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా వింతగా వ్యవహరిస్తున్నాడు. తాను గృహ నిర్బంధం నుండి విడుదల అయ్యోవరకు గడ్డం గీసుకోకుండా ఉంటానని తెలిపాడు. 29 రోజులుగా ప్రత్యేక అతిధి గృహంలో ఉన్న ఒమర్ అబ్దుల్లా ఇప్పటి వరకు గడ్డం గీసుకోకుండా ఉన్నాడని దీంతో ఆయన్ను మొదటి సారి గుర్తు పట్టేందకు కూడ వీలు లేకుండా ఉందని అయన కుటుంభ సభ్యులు తెలిపారు.

కశ్మీర్ ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యగా పలువురు రాజకీయ నాయకులతో పాటు కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్ అబ్దుల్లా, మహబుబా ముఫ్తిలను గృహ నిర్భంధంలో ఉంచారు. దీంతో ఈనేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా పలు పుస్తకాలను చదువుతూ కాలం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాష్ట్ర అతిధి గృహం అయిన హరి నివాస్‌లో ఒమర్ అబ్డుల్లాను ఆయన సోదరీ సాఫియాతోపాటు ఇతర కుటుంభ సభ్యులు ఓ అడ్వకేట్ సమక్షంలో కలిశామని తెలిపారు.
ఈనేపథ్యంలోనే ఆయనకు బయట జరిగే ఇతర విషయాలు తెలియడం లేదని తెలిపింది. దీంతో అతిధి నివాసంలో కనీసం టీవీ కూడ రావడం లేదని, దీంతో ఆయనకు నచ్చిన సినిమా సీడీలను అందించామని చెప్పారు. మరోవైపు ఆయన పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నాడని తెలిపారు. ఈనేపధ్యంలోనే ఆయన గడ్డం పెంచుతున్నాడని ,దాని గురించి అడిగినప్పుడు తాను గృహ నిర్భంధం నుండి బయటపడే వరకు గడ్డం పెంచుతానని తెలిపినట్టు ఆయన సోదరి మీడీయాతో తెలిపింది.












Click it and Unblock the Notifications