కళాశాలల్లో 2 నెలల పాటు నో ఈవెంట్స్: కర్ణాటక ఆంక్షలు: ఆ రెండు రాష్ట్రాల సరిహద్దులు క్లోజ్
ముంబై: దక్షిణాఫ్రికాలో కొత్తగా పుట్టుకొచ్చిన ప్రాణాంతక కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇదివరకు వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారికి సంబంధించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కంటే దీన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఈ వేరియంట్‌ను వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి తక్షణ చర్యలను తీసుకోవాలని సూచించింది.
మృతదేహాన్ని
తీసుకెళ్తోన్న
వ్యాన్‌కు
ఘోర
ప్రమాదం:
18
మంది
దుర్మరణం:
గవర్నర్,
సీఎం
సంతాపం

యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు..
ఫలితంగా- అన్ని దేశాలు దక్షిణాఫ్రికా సహా, ఇతర ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే వారిని క్వారంటైన్ చేస్తోన్నాయి. భారత్ కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారమే దేశ రాజధానిలో అత్యున్నత సమావేశాన్ని నిర్వహించారు. వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కేంద్ర కేబినెట్ కార్యదర్శితో భేటీ అయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ దేశంలో విస్తరించకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలను యద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని ఆదేశించారు.

రాజేష్ భూషణ్ తాజా లేఖ..
అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వైద్య-ఆరోగ్య మంత్రిత్వ శాఖలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. కొత్త కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించాంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలు రాశారు. రోజువారీ కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా ఉంచాలని, వారి ఆరోగ్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకోవాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని చెప్పారు.

సరిహద్దులు మూసివేత..
ఈ పరిణామాల మధ్య కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు కొత్త కోవిడ్ ప్రొటోకాల్స్‌ను రూపొందించాయి. వాటిని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న ఆఫ్రికన్ దేశాలకు ఆయా రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉన్నందున.. తక్షణ చర్యలకు దిగాయి. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులను మూసివేశాయి.

72 గంటల ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే..
సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశాయి. రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులపై ఆంక్షలను విధించాయి. కరోనా వైరస్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుందని సూచించాయి. కర్ణాటక ప్రభుత్వం కేరళ, మహారాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్ పాయింట్లను ఏర్పాటు చేసింది. 72 గంటల పాటు అమలులో ఉండేలా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్‌ను అందిస్తేనే.. కర్ణాటకలో ప్రవేశించే వీలును కల్పించింది.

ధార్వాడ ఎఫెక్ట్..
కాగా- ధార్వాడలో ఎస్డీఎం వైద్య కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. 289 మంది విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ఈ వైద్య కళాశాల, ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ధార్వాడ, బెంగళూరు, మైసూరు క్లస్టర్లలో ఉన్న అన్ని కళాశాలలు, విద్యాసంస్థల్లో సదస్సులు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలను వాయిదా వేసింది.

నో ఈవెంట్స్..
ఎలాంట ఈవెంట్లను కూడా నిర్వహించడానికి అనుమతి ఇవ్వొద్దంటూ విశ్వవిద్యాలయాలకు ఆదేశాలను జారీ చేసింది. వాటిని హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకోవాలని సూచించింది. ఈ మేరకు కర్ణాటక వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి టీకే అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్‌ను పాటించాలని సూచించారు. 18 సంవత్సరాలకు పైనున్న వయస్సు ఉన్న ప్రతి విద్యార్థికి వ్యాక్సిన్ అందించాలని అన్నారు.