నిన్న కాషాయం. నేడు నెత్తిన ముస్లీం టోపి పెట్టుకుని ప్రజల నెత్తిన టోపీ ?
బెంగళూరు/హుబ్బళి: భారతీయుల గురించి ఆలోచించే వాళ్లు, దేశాన్ని కాపాడాలని అనుకునే వాళ్లు, జాతి, ధర్మం కోసం పోరాటం చేసే వాళ్లు మాత్రమే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తారని, అది బీజేపీ నాయకుల వలనే సాధ్యం అని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.
గురువారం హుబ్బళిలో బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడారు. ప్రజలకు మంచి చెయ్యాలని అనుకుంటున్న నాయకులు మాత్రమే శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడుతారని, వారే దేశం కోసం పోరాటం చేస్తారని కేఎస్, ఈశ్వరప్ప అన్నారు. అలా చెయ్యడం బీజేపీ నాయకులకు మాత్రమే సాధ్యం అని కేఎస్. ఈశ్వరప్ప అన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడనికి బీజేపీ హైకమాండ్ యువకులకు ఎక్కువ అవకాశం ఇచ్చిందని, ఈ దేశాన్ని కాపాడటం బీజేపీ నాయకులకే సాధ్యం అని ఈశ్వరప్ప అన్నారు. హుబ్బళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి మహేష్ టింగినకాయకు బీజేపీ టిక్కెట్ ఇవ్వడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పిన కేఎస్. ఈశ్వరప్ప మాజీ సీఎం జగదీష్ శెట్టర్ మీద మండిపడ్డారు.
మాజీ సీఎం జగదీష్ శెట్టర్ బీజేపీని వదిలిపెట్టి కాంగ్రెస్ లో చేరడం వలన బీజేపీకి ఎలాంటి నష్టం లేదని మజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్ప అన్నారు. ఇంతకాలం బీజేపీ జెండా పెట్టుకుని తిరిగిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ముస్లీంల మీద ప్రేమ పెరిగిపోయిందని, వెంటనే నెత్తిన ముస్లీంలు పెట్టుకునే టోపీ పెట్టుకుని ముస్లీంలతో కలిసి తిరిగేస్తున్నారని కేఎస్ ఈశ్వరప్ప మండిపడ్డారు.
హుబ్ళళి-ధారవాడ సెంట్రల్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మహేష్ టింగినకాయ విజయం సాధిస్తారని జోస్యం చెప్పిన కేఎస్. ఈశ్వరప్ప మాజీ సీఎం జగదీష్ శెట్టర ఓడిపోతారని పోరోక్షంగా అన్నారు. ఇంతకాలం మనం మనం అణప్పురం అని తిరిగిన జగదీష్ శెట్టర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఆయన మీద బీజేపీ నాయకులు ఎదురుదాడి చెయ్యడం మొదలుపెట్టారు.












Click it and Unblock the Notifications