Editors Choice:మధ్యంతర బడ్జెట్‌లో పట్టణ గృహనిర్మాణంకు ప్రాధాన్యత ఇవ్వాలి..!
PMAY:ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఇది కేవలం మూడు నెలలకు మాత్రమే ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కావడంతో ఇది ప్రజాకర్షక బడ్జెట్‌గా నిలుస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు పెడుతున్న బడ్జెట్ కాబట్టి ఇందులో సామాన్యులకు మేలుకలిగే చాలా అంశాలను నిర్మలమ్మ పొందుపరుస్తారని భావిస్తున్నారు. ఇక అదే సమయంలో ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను సాకారం చేసేలా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మురికివాడల్లో ఇంటి నిర్మాణాలపై కేంద్ర దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ అంచనాల ప్రకారం అనుకున్న దానికంటే గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్ల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్లు తక్కువగా నిర్మించినట్లు తెలుస్తోంది.ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ఐదేళ్లలో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం రూ.2900 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.అయినప్పటికీ కూడా అందరికీ సొంతింటి కల కలలానే మిగిలిపోయింది. ఈ దూరాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని మరికొన్నేళ్లు కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అడ్డంకులు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం (PMAY)నాలుగు భాగాలుగా విభజించారు: మురికివాడల పునఃఅభివృధ్ధి, గృహాలకు సబ్సీడీపై రుణం,భాగస్వామ్యంతో కూడిన సరసనమైన ధరకే గృహం,లబ్ధిదారుల గృహా పెంపు మరియు నిర్మాణం.ప్రస్తుతం మురికివాడల పునరాభివృద్ధిపై ముందుగా తెలుసుకుందాం.
భారత్‌లో 40శాతం మంది ప్రజలు కేటాయించిన లేదా అనధికారిక మురికివాడల్లో నివసిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఇది 49శాతంగా ఉంది.ఈ లెక్కలను చూస్తే మురికివాడలను అభివృద్ధి చేసి అక్కడ గృహాలను నిర్మించడంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కీలకంగా వ్యవహరిస్తుంది.మురికివాడలకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వాడలను విస్మరించిందనే వాదన ఉంది. మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు ఆరోగ్యం, నీరు, విద్య మొదలైన ప్రాథమిక సేవలను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం లేదనేది బలంగా వినిపిస్తోంది.
దీంతో మురికివాడల యొక్క స్థిరత్వం ప్రశ్నార్థకంగా మారింది. నదీపరీవాహక ప్రాంతాల్లో,కొండచరియలు విరిగి పడే ప్రాంతాల్లో,చెత్త చెదారం వేసే ప్రాంతాల్లో,మురుగుకాలువల పక్కన మురికివాడలకు స్థలం కేటాయించి అక్కడ ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇలాంటి ప్రమాదాపు స్థలాల నుంచి మురికివాడలను మరో సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలనే డిమాండ్ వినిపిస్తోంది.అదే సమయంలో ఒక్కసారిగా సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం మొదలైతే అప్పటి వరకు అదే ప్రాంతంలో జీవనోపాధి పొందుతున్న చాలామందికి కష్టతరం అవుతుందనే భయం కూడా ఉంది.

ఏం చేయాలి..?
ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క పునరాభివృద్ధి అంశాలను పునఃపరిశీలించాల్సి ఉంటుంది.మురికివాడ నిర్వాసితులకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నిర్వాసితులతో చర్చించి తమకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే ప్రాంతాలను ఎంపికచేసి అక్కడ వారికి నివాస వసతి కల్పించాలి.వారి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించి అమలు చేయాలి.
ఇలా అందరితో చర్చించి ఏకాభిప్రాయం కలిగితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలుకు సార్థకత చేకూరుతుంది.ఇక నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు వారిపేరిట తయారు చేసి ఇవ్వాలి.ఇప్పటి వరకు కర్నాటక రాష్ట్రం మాత్రమే ఈ నిబంధనలను పాటిస్తోంది. పేదలకు ఇచ్చిన భూమి, ఇళ్ల పట్టాలు వారి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తాయి. వారిలో ధైర్యం నింపుతాయి.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గైడ్‌లైన్స్‌ను మార్చాలి
స్థోమత మరియు 'సరసమైన గృహాలు' అనేవి ఆత్మాశ్రయ భావనలు.స్థోమత లేని పేదలను మినహాయిస్తే స్వాభావిక నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. దీనిని పరిష్కరించేందుకు, PMAY మార్గదర్శకాలలో స్పష్టమైన మరియు సున్నితమైన నిబంధనలు ఇంకా సబ్సిడీలను రూపొందించడం అవసరం. సామాజిక మరియు ఆర్థిక స్థితిగతుల ఆధారంగా వివిధ విభాగాలకు ప్రమాణాలు మరియు సబ్సిడీ స్థాయి మార్చేలా వెసులుబాటు కల్పించాలి.
పట్టణాలు లేదా సమాజ నిర్మాణంలో ప్రణాళిక బద్దమైన గృహనిర్మాణం కీలక పాత్ర పోషిస్తుంది. మన విలువలను మన భవిష్యత్తు ఎలా ఉండాలో గృహ నిర్మాణం ప్రతిబింబిస్తుంది.ఈ నేపథ్యంలోనే సాంస్కృతికంగా సున్నితమైన మరియు పర్యావరణ అనుకూలత కలిగిఉన్న గృహాలు చాలా అవసరం.అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నిర్మాణమయ్యే ఇళ్లల్లో ఈ ప్రమాణాలేవి కనిపించవు.అందుకే ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకుని బలంగా నిలబడే గృహాల నిర్మాణంను కేంద్రం ప్రోత్సహించాలి.












Click it and Unblock the Notifications