‘నోటివెంట మాట రాలేదు! కాశ్మీరీలు సిగ్గుతో తలదించుకోవాలి’
అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ముస్లీంలకు, కాశ్మీరీలకు మచ్చ తీసుకొచ్చిందన్నారు.
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ముస్లీంలకు, కాశ్మీరీలకు మచ్చ తీసుకొచ్చిందన్నారు. అంతేగాక, ఈ ఘటనతో ప్రతీ కాశ్మీరీ సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఉగ్రవాదుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న యాత్రికులను సీఎం మెహబూబా ముఫ్తీ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రతీ సంవత్సరం అనేకమంది కాశ్మీర్‌కు వస్తున్నారని చెప్పారు.

అయితే, ఈసారి ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని.. ఈ ఘటనపై సమాచారం అందగానే తనకు నోటి వెంట మాటరాలేదని అన్నారు ముఫ్తీ. దాడికి పాల్పడిన వారిని పోలీసులు త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకముందని తెలిపారు.
జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం రాత్రి అమర్నాథ్ యాత్రికులపై లష్కరే తొయిబా ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో ఏడుగురు మరణించగా, 11మంది గాయపడ్డారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications