బీజేపీలోకి 100మందికి కార్పోరేట్ దిగ్గజాలు, సోనియా ఫైర్ (పిక్చర్స్)
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలోకి ఒక్కరోజే వందకు పైగా వివిధ కంపెనీలకు చెందిన సీఈవో, ఇతర వృత్తి నిపుణులు చరారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, పార్టీ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సమక్షంలో ఆదివారం వారు పార్టీలో చేరారు. వీరి చేరికలో అనురాగ్ ప్రముఖ పాత్ర పోషించారు. బీజేపీలో చేరిన వారిలో స్పైస్ జెట్, ఖతార్ ఎయిర్ లైన్స్, ఫోర్టిస్ ఆసుపత్రితో పాటు బ్యాంకింగ్ రంగంలోని సీఈవోలు, నిపుణులు ఉన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. బీజేపీ కేవలం పార్టీ కాదని, కుటుంబం అన్నారు. కార్పోరేట్ నేతలు పార్టీలో చేరడం లేదని కుటుంబంలో చేరుతున్నారన్నారు. తాజాగా పార్టీలో చేరిన వారు అంతా జాతినిర్మాణంలో పాలు పంచుకుంటారన్నారు. దేశంలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు కార్పోరేట్ వర్గాలు కృషి చేయాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం మేకిన్ ఇండియా లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
పార్టీలో చేరిన వారిలో ఖతార్ ఎయిర్ లైన్స్ భారత విభాగాధిపతి హెన్రీ మోసెస్, లుఫ్తాన్సాకు చెందిన అలంగిర్ ఖాన్, అయికాన్ గ్రూపుకు చెందిన అనిల్ పరాశర్, కార్పోరేట్ అలయన్స్ గ్రూపుకు చెందిన కపిల్ కుమారియా, ఫోర్టిస్ ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ నవీన్ తల్వార్ తదితరులు ఉన్నారు.

బీజేపీలోకి సీఈవోలు
భారతీయ జనతా పార్టీలోకి ఒక్కరోజే వందకు పైగా వివిధ కంపెనీలకు చెందిన సీఈవో, ఇతర వృత్తి నిపుణులు చరారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, పార్టీ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సమక్షంలో ఆదివారం వారు పార్టీలో చేరారు.

బీజేపీ
ప్రభుత్వం నడపడమనేది ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, బాధ్యతల నుంచి పారిపోవడం దానికి సమాధానం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

బీజేపీ
సామాన్యుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే ప్రభుత్వ బాధ్యత అన్నారు. కేజ్రీవాల్ పేరెత్తకుండానే మోడీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని ద్వారకలో ప్రధాని ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ అంటే మినీ భారతమని అందుకే ఢిల్లీ బాగోగులను కేంద్రం కూడా చూస్తుందని అన్నారు.

బీజేపీ
పలువురు బీజేపీ తెలుగు నాయకులు ఆదివారం ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మహీపాల్‌పూర్, బిజ్వాసన్ ప్రాంతాల్లో, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సినీనటుడు కృష్ణంరాజు తదితరులు పర్యటించారు.

బీజేపీ
ఒక్కరోజే ఏకంగా 100మందికి పైగా టాప్ కంపెనీల సీఈవోలు ఆదివారం బీజేపీలో చేరారు. పార్టీ అధినేత అమిత్‌షా, బీజే వైఎం అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో వీరంతా పార్టీలో చేరారు.

కాంగ్రెస్
ప్రధాన మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌లపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విరుచుకు పడ్డారు. ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ, మోడీప్రచారక్ అయితే, కేజ్రీవాల్ ధర్నాల మనిషన్నారు. వీరి కల్లబొల్లి వాగ్దానాలను నమ్మకుండా ఓటర్లు ఢిల్లీని రక్షించాలని కోరారు. ఢిల్లీ ప్రజలకు కావాల్సింది సుపరిపాలనే తప్ప, తప్పుడు వాగ్దానాలు కాదన్నారు.

కాంగ్రెస్
బీజేపీ, ఆప్ ఓటర్లను గందరగోళం చేస్తూ కల్లబొల్లి వాగ్దానాలు చేస్తున్నాయని సోనియా గాంధీ విమర్శించారు. యూపీఏ హయాంలో తెచ్చిన ఆహార భద్రత, భూసేకరణ చట్టాలకు తూట్లు పొడవాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.

కాంగ్రెస్
అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పెద్ద పెద్ద వాగ్దానాలు చేసినా, ఇప్పటి వరకూ చేసిందేమీ లేదన్నారు.












Click it and Unblock the Notifications