oYo సీఇవో మీద 420 కేసు, మాజీ సైనికుడికి మోసం!, రూ. కోటి, రెడ్డి అండ్ కో!
బెంగళూరు: ఆన్ లైన్ ద్వారా హోటల్స్ అండ్ హోమ్స్ బుక్ చేస్తున్న ఓయో (oYo)అప్లికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఇవో మీద బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ సీఇవో రితీష్ అగర్వాల్ మీద, ఆ కంపెనీకి చెందిన ఇద్దరు ప్రతినిధుల మీద 406, 420 కేసులు నమోదు చేశామని బెంగళూరు నగర పోలీసులు తెలిపారు.
బెంగళూరు నగరంలోని వైట్ ఫీల్డ్ లో బీఇఎంఎల్ లేఔట్ లో రాజ్ గురు శెల్టర్ హోటల్ ఉంది. రాజ్ గురు శెల్టర్ హోటల్ యజమాని, మాజీ సైనికుడు నటరాజన్ వీఆర్ఎస్ ఓయో కంపెనీ యాజమాన్యం మీద ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

2017 జూన్ లో ఓయో కంపెనీతో తమకు అగ్రిమెంట్ అయ్యిందని రాజ్ గురు శెల్టర్ హోటల్ యజమాని నటరాజన్ అంటున్నారు. ఓయో 20 శాతం పెట్టుకుని మిగిలిన 80 శాతం చెల్లిస్తామని అగ్రిమెంట్ లో ఉందని, అయితే బెంగళూరు ప్రతినిధులు ఆనంద్ రెడ్డి, ప్రతీక్ సింగ్ 80 శాతం వాళ్లు పెట్టుకుని 20 శాతం మాత్రమే తమకు చెల్లించారని హోటల్ యజమాని నటరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఓయో కంపెనీ ప్రతినిధులు ఈ రకంగా తమకు సుమారు రూ. ఒక కోటి వరకు మోసం చేశారని, తమకు న్యాయం చెయ్యాలని నటరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటరాజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన వైట్ ఫీల్డ్ పోలీసులు ఓయో కంపెనీ సీఇవో రితేష్ అగర్వాల్, కంపెనీ ప్రతినిధులు ఆనంద్ రెడ్డి, ప్రతీక్ సింగ్ మీద ఐపీఎస్ 406, 420 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. కేసు విచారణలో ఉందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వైట్ ఫీల్డ్ పోలీసు అధికారులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications