ఐరాసలో కాశ్మీర్: పాకిస్తాన్ టైం వేస్ట్ చేసుకుంటుందన్న భారత్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐక్య రాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో జమ్ము కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడం అనవసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయీద్‌ అక్బరుద్దీన్‌ అన్నారు.

సోమవారం జరిగే ఐరాస అసెంబ్లీ సమావేశాల్లో కాశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తాలని పాకిస్థాన్‌ భావిస్తోంది. దీనిపై సయీద్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

బెదిరించడం ఆపండి: చైనా, అమెరికాకు మళ్లీ ఉ.కొరియా హెచ్చరిక

గత 40ఏళ్లలో యూఎన్‌జీఏలో ఎన్నడూ కాశ్మీర్‌ అంశంపై అధికారిక చర్చలు జరగలేదని, అందువల్ల ఈ విషయాన్ని సభలో లేవనెత్తడం అంటే పాకిస్తాన్ తన సమయాన్ని వృథా చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు.

Pakistan raising Kashmir issue at UN is like ‘miyan ki daud masjid tak’: Syed Akbaruddin

ఈ సమావేశాల్లో భారత్‌ సంస్కరణలు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, వాతావరణ మార్పులు, శాంతి తదితర విషయాల గురించి యూఎన్‌జీఏ వేదికగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

మా దేశం, మా హక్కు: చైనాకు అమిత్ షా దిమ్మతిరిగే కౌంటర్

జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌పై నిషేధం విధించాల్సిందిగా భారత్‌ ఐక్య రాజ్య సమితిని కోరనుంది. సోమవారం జరిగే ఐక్య రాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్థాన్‌ ప్రధాని షాహిబ్‌ ఖాక్వాన్‌ అబ్బాసీ పాల్గొననున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Taking a jibe at Pakistan, a top Indian diplomat has said Islamabad’s decision to raise the Kashmir issue at the United Nations is like ‘Miyan ki daud masjid tak’. India, on the other hand, is focused on a progressive, forward-looking agenda during the UN General Assembly session beginning on Monday, India’s permanent representative to the UN Syed Akbaruddin told reporters.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X