పాకిస్తాన్ భారీ కుట్ర.. దాడులే లక్ష్యంగా భారత్ వైపు కదిలిన ‘హంతకుల ముఠా’!?
పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ భారీ కుట్రకు తెరలేపింది. దాడులే లక్ష్యంగా భారత్ పైకి ఓ ఉగ్రవాదుల ముఠాను ఉసిగొల్పింది. ఈ ముఠాకు ‘హలాల్ దస్తా’ అని పేరు పెట్టింది.
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) భారీ కుట్రకు తెరలేపింది. దాడులే లక్ష్యంగా భారత్ పైకి ఓ ఉగ్రవాదుల ముఠాను ఉసిగొల్పింది. ఈ ముఠాకు 'హలాల్ దస్తా' అని పేరు పెట్టింది.
''ఉగ్రవాదులను అణచివేస్తున్నామంటూ పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతుంటే ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మాత్రం ఉగ్రవాదులతో సంబంధాలు నెరుపుతోంది..''- ఈ మాటలు స్వయంగా అగ్రరాజ్యం అమెరికా అన్నది. ఇప్పుడు తాజాగా బయటికొచ్చిన ఒక వార్త వింటే ఆ మాటలు నిజమేనేమో అనిపించకమానదు.

భారత్ కు చెందిన నిఘా సంస్థ పాకిస్తాన్ ప్లాన్ ను పసిగట్టి హెచ్చరించింది. హలాల్ దస్తా.. అంటే హంతకుల ముఠా అని అర్థం. ఈ ముఠాలో ఉన్న వారంతా నిషేధానికి గురైన లష్కరే తోయీబాకు చెందిన ఉగ్రవాదులు.
నిఘా సంస్థ సమాచారం ప్రకారం... ఈ కిల్లింగ్ స్క్వాడ్ ఇప్పటికే భారత్ వైపు బయలుదేరింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న జమ్మూ కశ్మీర్ లోని సురాన్ కోట్, పూంచ్ జిల్లాలో దాడులు జరపడం ఈ ముఠా టార్గెట్.
గత వారమే పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్(బాట్) భారత్ లోకి చొరబడేందుకు విశ్వప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ హంతక ముఠా భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు బయలుదేరింది. స్వయంగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన యాక్షన్ టీమ్ పనిచేసే ప్రాంతం నుంచే ఈ ముఠాతో భారత్ పై దాడులు చేయించేందుకు పాకిస్తాన్ గూఢఛర్య సంస్థ ఐఎస్ఐ ప్రణాళికలు రచించింది.












Click it and Unblock the Notifications