సైనిక స్థావరాలపై పాక్ దాడి: పలువురికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో భారత సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైనిక దళాలు ఆదివారం రాత్రి నుంచి కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. సాంబా, కథువా జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి సుమారు 30 సైనిక స్థావరాలపై పాక్ బలగాలు దాడులు చేశాయి.

సోమవారం ఉదయం తర్వాత వరకు 12 గ్రామాలపై కాల్పులు జరిగాయి. భారీ మిషన్ గన్స్, మోర్టార్ షెల్స్‌తో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో కొందరు భారతీయ పౌరులు గాయపడ్డారు. చాలా ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి.
కాగా, శుక్రవారం నాటి పాక్ సైన్యం జరిపిన దాడిలో ఒక భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో సరిహద్దుల్లోని గ్రామ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయాందోళనలతో జీవిస్తున్నారు.












Click it and Unblock the Notifications