అన్నాడీఎంకే విలీనం: మీడియాకు హింట్ ఇచ్చిన పన్నీర్ సెల్వం, అమ్మ సమాధి సాక్షిగా!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాల విలీనం విషయంలో అతి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. శనివారం పన్నీర్ సెల్వం చెన్నైలోని ఆయన ఇంటిలో మీడియాతో మాట్లాడుతూ విలీనం చర్చలు జరుగుతున్నాయని అన్నారు.
శుక్రవారం రాత్రి విలీనం విషయంపై ఇరు వర్గాలు చర్చలు జరిపాయని, సానూకూల వాతావరణం ఉందని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. తమ డిమాండ్ల విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి సానుకూలంగానే స్పందించారని పన్నీర్ సెల్వం వివరించారు.

శనివారం రాత్రి మరో సారి విలీనం చర్చలు ఉంటాయని పన్నీర్ సెల్వం హింట్ ఇచ్చారు. తమిళనాడులో మరో నాలుగు సంవత్సరాలు అన్నాడీఎంకే ప్రభుత్వం ఉంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని పన్నీర్ సెల్వం వివరించారు.
మొత్తం మీద సానుకూలంగా విలీనం చర్చలు జరుగుతున్నాయని అన్నాడీఎంకే (పురచ్చి తలైవి అమ్మ) వర్గం నాయకుడు పన్నీర్ సెల్వం మొదటి సారి బహిరంగంగా మీడియాకు చెప్పడంతో విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు య్యిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. సోమవారం మంచి ముహుర్తం చూసుకుని అమ్మ జయలలిత సమాధి సాక్షిగా ముక్కలైన అన్నాడీఎంకే పార్టీని ఒక్కటి చెయ్యాలని రెండు వర్గాలు నిర్ణయించాయి.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications