వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకో దండం: పన్నీర్ సెల్వం రాజీనామా ? శశికళ చేతిలో లేఖ

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారని మంగళవారం అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. రోజురోజుకు మారుతున్న రాజకీయ నాటకాలు తట్టుకోలేక, సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా మాట్లాడటం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేశారని మంగళవారం అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. రోజురోజుకు మారుతున్న రాజకీయ నాటకాలు తట్టుకోలేక పన్నీర్ సెల్వం రాజీనామా చేశారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.

జయలలిత మేనకోడలు దీపాకు జై: రెండు రోజాపూలు గుర్తు

తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ లేఖను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు ఇచ్చేశారని మంగళవారం అన్నాడీఎంకే నాయకులు చెప్పారు. జయలలిత మరణించిన తరువాత అదేరోజు అర్దరాత్రి తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

Paneerselvam submit his resignation letter to AIADMK General Secretary Sasikala ?

ఇటీవల అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించారు. అయితే ప్రభుత్వంలో కీలక మంత్రి పదవిలో ఉన్న ఉదయ్ కుమార్, లోక్ సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై తదితరులు శశికళ సీఎం కావాలని మీడియా ముందు బహిరంగంగా చెప్పారు.

జయలలిత బెడ్ రూంలో శశికళ, ఏం చేస్తున్నారంటే ?

శశికళ కోసం పన్నీర్ సెల్వం తన సీఎం పదవికి రాజీనామా చేసి త్యాగం చేస్తారని వారు అన్నారు. సొంత పార్టీలోనే తనకు వ్యతిరేకంగా మాట్లాడటంతో విసుగు చెందిన పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేసి ఆ లేఖను శశికళకు ఇచ్చేశారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ విషయంపై పన్నీర్ సెల్వం కాని, శశికళ కాని ఇప్పటి వరకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. శశికళ ఎప్పుడు సీఎం కావాలనుకుంటే ఆ రోజు పన్నీర్ సెల్వం ఇచ్చిన రాజీనామా లేఖను బయటపెడుతారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.

English summary
Sources said that Tamil Nadu CM O Paneerselvam submit his resignation letter to AIADMK General Secretary Sasikala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X