వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంపుకునేదాకా వెళ్లిందా?: ఆర్కేనగర్ పోరులో పన్నీర్ అభ్యర్థికి బెదిరింపులు

ఆర్కేనగర్ బరి నుంచి తప్పుకోకపోతే చంపేస్తామని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మధుసూదన్ కు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని పన్నీర్ వర్గం ఆరోపిస్తోంది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రస్తుతం తమిళనాట అందరి గురి ఆర్కేనగర్ ఉపఎన్నిక పైనే నిలిచింది. గెలిచేదెవరో, ఓడిపోయెదెవరో ఇప్పుడే చెప్పలేం గానీ పార్టీలు మాత్రం శక్తివంచన లేకుండా ఇక్కడ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థులు పన్నీర్ సెల్వం-చిన్నమ్మ శశికళ వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

ప్రజల్లో పన్నీర్ సెల్వం పట్ల ఉన్న సానుభూతి తమ అభ్యర్థి మధుసూదన్ గెలుపుకు కలిసొస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకె పార్టీ చిహ్నాం 'రెండాకులు' తనకే చెందుతుందంటూ ఎన్నికల కమిషన్ ను సైతం ఆశ్రయించారు. పార్టీ గుర్తు కూడా తనకే కేటాయిస్తే ప్రజల్లో తన పట్ల మరింతగా సెంటిమెంటు బలపడుతుందనేది పన్నీర్ ఆలోచనగా తెలుస్తోంది.

panneer selvam candidate madhusudhan complaint to dgp

ఇదంతా బాగానే ఉన్నా పన్నీర్ అభ్యర్థి మధుసూదన్ కు పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరింపులు వస్తుండటం వారిని కలవరపెడుతోంది. ఆర్కేనగర్ బరి నుంచి తప్పుకోకపోతే చంపేస్తామని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మధుసూదన్ కు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని పన్నీర్ వర్గం ఆరోపిస్తోంది. ఈ మేరకు మంగళవారం నాడు మధుసూదన్ డీజీపీకి ఫిర్యాదు చేసి తనకు భద్రత కల్పించాల్సిందిగా కోరారు.

మధుసూదనన్ తరపు న్యాయవాది ఆర్‌వీ బాబు దీనికి సంబంధించి ఫిర్యాదును డీజీపికి అందజేశారు. కాగా, రాజకీయంగా పుంజుకోవాలంటే ఆర్కేనగర్ లో విజయం సాధించడం పన్నీర్ సెల్వం వర్గానికి ప్రస్తుతం తప్పనిసరిగా మారింది. లేనిపక్షంలో చిన్నమ్మ శశికళ వర్గం బలపడే అవకాశం ఉంది. అదే జరిగితే పన్నీర్ సెల్వం రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.

పన్నీర్ సెల్వం వర్గం అభ్యర్థి మధుసూదన్ కు కలిసొచ్చే మరో అంశం.. ఆయన గెలుపుకోసం తెలుగువారు సైతం ప్రచారం చేస్తున్నారు. మదుసూదన్ నెల్లూరు జిల్లా కావలికి చెందిన తెలుగువాడు కావడంతో.. ఆర్కేనగర్ లోని తెలుగువారి ఓట్లు ఆయనకే పోల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Entire Tamilnadu is now discussing on RK Nagar by election in chennai. On tuesday, Panneer selvam candidate Madhusudan complainted to dgp on threatening calls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X