వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధిక్కారంతో 'ది హీరో'గా పన్నీర్: సోషల్ మీడియాలో పోటెత్తుతున్న మద్దతు

మెరీనా బీచ్ వ‌ద్ద ప్రారంభించిన తిరుగుబాటులో ప‌న్నీర్ సెల్వంనే విజయం వరించి తీరుందని ఓ నెటిజెన్ ఆకాంక్షించడం గమనార్హం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు అక్కడి రాజకీయ సమీకరణాలను వేగంగా మార్చేస్తున్నాయి. 'పన్నీర్ సెల్వం' తన తిరుగుబాటుకు మరింత పదునుపెడుతున్నారు. అవసరమైతే జయ మేనకోడలు దీప మద్దతు సైతం కోరుతానని స్పష్టం చేశారు.

పన్నీర్ సీఎం పదవికి రాజీనామా చేయగానే.. ఇక ఆయన ఎప్పటికీ డమ్మీనే అన్న సెటైర్లు సోషల్ మీడియాలో చాలానే వినబడ్డాయి. అయితే అనూహ్య రీతిలో ఆయన ధిక్కార స్వరం వినిపించి శశికళ 'సీఎం' ఆశలకు చెక్ పెట్టడానికి ప్రయత్నించడంతో.. ఇప్పుడదే సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

<strong>సర్వే: శశికళను ఛీకొట్టిన ప్రజలు, పన్నీర్‌పై జయ ఇలా...</strong>సర్వే: శశికళను ఛీకొట్టిన ప్రజలు, పన్నీర్‌పై జయ ఇలా...

ముఖ్యంగా తొలినుంచి జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడుగా ఉండటం.. శశికళను ఎట్టిపరిస్థితుల్లోను రాజకీయాల్లోకి రానివ్వద్దు అని జయలలిత పలు సందర్బాల్లో పార్టీ నేతలతో పేర్కొనడం వంటి అంశాలు శశికళ పట్ల వ్యతిరేకత ఏర్పడటానికి కారణమవుతున్నాయి.

Panneerselvam becomes a hero for netizens after his Marina declaration

నిన్నటిదాకా పన్నీర్ ను ఓ రబ్బర్ స్టాంపు అని, లేడీస్ సీటులో కూర్చొని.. వాళ్లు వచ్చినప్పుడల్లా ఆ సీటు నుంచి తప్పుకుంటాడని నెటిజెన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడదే నెటిజెన్స్ ప‌న్నీర్‌ సెల్వంకు మద్దతుగా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. మెరీనా బీచ్ వ‌ద్ద ప్రారంభించిన తిరుగుబాటులో ప‌న్నీర్ సెల్వంనే విజయం వరించి తీరుందని ఓ నెటిజెన్ ఆకాంక్షించడం గమనార్హం.

అన్నాడీఎంకె ఎమ్మెల్యే హరి ప్రభాకరన్ సైతం పన్నీర్ కు మద్దతుగా ట్వీట్ చేయడం గమనార్హం. పదవి గురించి తాను భయపడట్లేదని చెప్పిన ఆయన.. అమ్మ త‌మ‌తోనే ఉన్నారని పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప‌న్నీర్ సెల్వం వెంటే ఉన్నార‌న్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

English summary
Social media exploded in support of Tamil Nadu chief minister O Paneerselvam as soon as he ended his explosive press conference+ on Marina Beach where he hit out against AIADMK legislature party leader V K Sasikala alleging that he was forced to resign
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X