పోయెస్ గార్డెన్ నుంచి శశికళ ఔట్: జీవోపై సంతకం చేసేసిన పన్నీర్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నిస్తున్న శశికళకు ఆరాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చుక్కలు చూపిస్తున్నారు. జయలలిత మరణించిన తరువాత పోయెస్ గార్డెన్ లో మకాం వేసి చక్రం తిప్పుతున్న శశికళను అక్కడి నుంచి గెంటేయ్యడానికి రంగం సిద్దం అయ్యింది.

చెన్నైలోని పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం అంటే జయలలితకు ప్రాణం. ఎంతో ప్రేమతో తనకు ఇష్టం అయిన వేదనిలయంలో జయలలిత తన జీవితం గడిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా సరే వేదనిలయం మాత్రం ఆమె మార్చలేదు.

2016 డిసెంబర్ 5వ తేది జయలలిత మరణించిన తరువాత వేదనిలయంలో శశికళ, మన్నార్ గుడి మాఫియా సభ్యులు మకాం వేశారు. అక్కడి నుంచే శశికళ కూడా అన్నాడీఎంకేలో చక్రం తిప్పారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. చివరికి సీఎం కావాలని పన్నీర్ సెల్వం మీద ఒత్తిడి తీసుకు వచ్చి ఆయనతో రాజీనామా చేయించారు.

Panneerselvam has launched a signature campaign to turn Jayalalithaa's residence into a memorial.

చిన్నమ్మ మీద తిరుగుబాటు చేసిన తరువాత పన్నీర్ సెల్వం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం జయలలిత స్మారక భవనం చేస్తామని శుక్రవారం ప్రకటించారు. చెప్పిన మాట ప్రకారం శనివారం మద్యాహ్నం వేదనిలయం ఖాళీ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వేదనిలయాన్ని జయలలిత స్మారక భవనం చెయ్యాలని సీఎంగా అధికారికంగా పన్నీర్ సెల్వం సంతకం చేసి శశికళ అండ్ కో కు చుక్కలు చూపించారు. పన్నీర్ సెల్వం నిర్ణయంపై జయలలిత అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై శశికళ, ఆమె వర్గీయులు ఎలా స్పందిస్తారో అంటూ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+