ప్రాణం తీసిన పారా సెయిలింగ్: వైరల్ వీడియో

కోయంబత్తూరు: సాహస క్రీడలో పాల్గొన్న ఓ వ్యాపారి ప్రాణాలు పోయాయి. పారా సెయిలింగ్ చెయ్యడానికి ప్రయత్నించి సుమారు నాలుగు అంతస్తుల పై నుంచి కిందపడి మృత్యువాతపడ్డాడు.

తమిళనాడులోని కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆవరణంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కోయంబత్తూరు మెడికల్ కాలేజ్ ఆవరణంలో పారా స్లైడింగ్ ఈవెంట్ నిర్వహించారు.

కోయంబత్తూరుకు చెందిన వ్యాపారవేత్త మల్లేశ్వర్ రావ్ (53) ఈవెంట్ కు వెళ్లారు. పారాచూట్ సహాయంతో గాలిలోకి ఎగరడానికి ప్రయత్నించారు. పారాచూట్ ను పట్టి ఉంచే బెల్ట్ సరిగా పెట్టుకోకపోవడంతో మల్లేశ్వర్ రావ్ ఇబ్బందికి గురైనాడు.

పైకి ఎగరలేక

పైకి ఎగరలేక

మల్లేశ్వర్ రావ్ బెల్ట్ సరిగా పెట్టుకోకపోవడంతో పైకి ఎగరలేక, కిందకు రాలేకపోయాడు.

రక్షించడానికి ప్రయత్నించారు

రక్షించడానికి ప్రయత్నించారు

విషయం తెలుసుకున్న నిర్వహకులు మల్లేశ్వర్ రావ్ ను రక్షించడానికి ప్రయత్నించారు.

నాలుగు అంతస్తుల ఎత్తులో

నాలుగు అంతస్తుల ఎత్తులో

నాలుగు అంతస్తుల ఎత్తులో బెల్ట్ ఊడిపోవడంతో మల్లేశ్వర్ రావ్ కిందపడిపోయాడు.

ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు.

ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు.

వెంటనే మల్లేశ్వర్ రావ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించాడని వెద్యులు చెప్పారు.

పోలీసులు ఎంట్రీ

పోలీసులు ఎంట్రీ

విషయం తెలుసుకున్న పోలీసులు మెడికల్ కాలేజ్ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఉన్న నిర్వహకులను అరెస్టు చెయ్యడానికి ప్రయత్నించారు.

అనుమతి లేదు

అనుమతి లేదు

ఎలాంటి అనుమతి తీసుకోలేదని, కనీసం రక్షణ కోసం ఏర్పాట్లు చెయ్యలేదని, నిర్వహకులు పరారైనారని, వారి మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+