పార్లమెంట్ రెండో విడత సమావేశాలు - ఒకేసారి రెండు సభలు : జమ్ము కాశ్మీర్ కోసం..!!
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కరోనా కారణంగా గతంలో విడి విడిగా సభలు నిర్వహించారు. అయితే, ఇప్పుడు కరోనా పూర్తిగా నియంత్రణలోకి రావటంతో తిరిగి యధావిధిగా రెండు సభలు కలిపి ఒకే సారి భేటీ కానున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే, కరోనా నిబంధనలకు లోబడే ఈ సమావేశాలు జరగనున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత జరుగుతున్న సమావేశాలు కావటంతో బీజేపీ జోష్ మీద కనిపిస్తోంది.
ఇదే సమయంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కీలక బిల్లుల ఆమోదం దిశగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేందుకు సిద్దం అవుతున్నాయి. ప్రధానంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులకు కనీస మద్దతు ధర, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులు వంటి కీలక అంశాలపై.. చర్చకు పట్టుబట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. ఉక్రెయిన్ లో భారత విద్యార్ధుల తరలింపు.. రష్యా - ఉక్రెయిన్ యుద్ద సమయంలో భారత్ వైఖరి పైన కేంద్రం పార్లమెంట్ లో స్పష్టత ఇఛ్చే అవకాశం ఉంది.

ఇక, పార్లమెంట్ లో అనుసరించాల్సిన వైఖరి పైన కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ బృందం సమావేశమైంది. పార్టీ అధినేత్రి సోనియాతో ఈ సమావేశం జరిగింది. ఇక, బడ్జెట్ ప్రతిపాదనలకు పార్లమెంట్ ఆమోదం లభించేలా సర్కారు కసరత్తు చేస్తోంది. లోక్సభలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన సవరణ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన బడ్జెట్ను సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఏప్రిల్ 8 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications