Rowdy: నేను రౌడీషీటర్, మీ పార్టీలో చేర్చుకుని మంచి పదవి ఇవ్వండి, కోర్టు ముందే ధర్నా !
బెంగళూరు/మైసూరు: రాజకీయాల్లోకి రావాలంటే నేను ధానదర్మాలు చేశాను, నన్ను మీ పార్టీలో చేర్చుకోండి అని ఎవరైనా రాజకీయ పార్టీల నాయకులకు చెబుతారు. చాలా మంది వ్యాపారులు, శ్రీమంతులు రాజకీయాల్లో ఉన్నారు. ఇక్కడ ఓ ప్రభుద్దుడు నేను రౌడీషీటర్, నన్ను మీ పార్టీలో చేర్చుకుని మంచి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసి కోర్టు సమీపంలోనే ధర్నా చెయ్యడం కలకలం రేపింది.
కర్ణాటకలోని మైసూరు సమీపంలోని చామరాజపేట్ లో రౌడీషీటర్ మంజు అలియాస్ పానీపూరి మంజు నివాసం ఉంటున్నాడు. ఇతని మీద అనేక కేసులు ఉండటంతో 2013లో కేఆర్ పేట్ పోలీసులు రౌడీషీటర్ జాబితాలో పానీపూరి మంజు పేరు చేర్చారు. ఇటీవల మైసూరుకు చెందిన రౌడీషీటర్ సైలెంట్ రవి బీజేపీలో చేరాడు.
సైలెంట్ రవి ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరంలో బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్యా, పీసీ మోహన్ పాల్గొన్నారు. అప్పటి నుంచి రౌడీషీటర్లు వివిద రాజకీయ పార్టీలలో చేరడానికి పోటీ పడుతున్నారు. మండ్య ఎంపీ సుమలతాకు ముఖ్య అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్న సచ్చిదానంద కూడా ఇటీవల బీజేపీలో చేరిపోయాడు.

నేను రౌడీషీటర్, నన్ను బీజేపీలో చేర్చుకుని తనకు మంచి పదవి ఇవ్వాలని పానీపూరి మంజు మైసూరు కోర్టు ఆవరణంలోని గాంధీ విగ్రహం ముందు విన్నాత్న రీతిలో ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని మైసూరు సిటీ రౌడీషీటర్ పానీపూరి మంజుకు వార్నింగ్ ఇచ్చారు.
అయితే పానీపూరి మంజు అక్కడి నుంచి కదలకపోవడంతో అతన్ని మైసూరు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. మొత్తం మీద నేను రౌడీనీ, మీ పార్టీలో చేర్చుకోండి అంటూ పానీపూరి మంజు ధర్నా చెయ్యడం మైసూరుతో పాటు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది. మంజు పరిస్థితి చూసి కొందరు నవ్వుకుంటున్నారు.












Click it and Unblock the Notifications