Air India: ఆన్‍లైన్‌లో అంతే ఉంది.. నేను అంతే చెల్లిస్తా.. లేకుంటే జైలుకెళ్తా..
జరిమానా కట్టలేను.. జైలుకే వెళ్తా అని ఓ కేసులో నిందితుడు కోర్టు తెలిపాడు.
ఎయిరిండియా విమానంలో స్మోకింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరపరిచారు. అయితే ఆ వ్యక్తికి కోర్డు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే సదరు వ్యక్తి రూ.25 వేలు చెల్లించడానికి నిరాకరించాడు. ఐపీసీ సెక్షనఅ కింద రూ.250 జరిమానా చెల్లించాలని ఆన్ లైన్ లో చూసినట్లు అతను కోర్టు తెలిపాడు.
తనకు బెయిల్ వద్దని జైలుకే వెళ్తానని చెప్పాడు. నిందితుడు రత్నాకర్ ద్వివేదికి కోర్టు నగదు బెయిల్ మంజూరు చేసింది, అయితే అతను ఆ మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించాడు మరియు జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు చెప్పాడు.
మార్చి 10న ఎయిరిండియాకు చెందిన లండన్-ముంబై విమానంలో లావేటరీలో స్మోకింగ్ చేస్తూ వికృతంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 336 కింద అతనిపై కేసు నమోదు చేశారు.

అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు అతన్ని హాజరు పరిచారు. అయితే బెయిల్ కోసం రూ.25 చెల్లించడానికి సిద్ధంగా లేకపోవడంతో అతడిని జైలుకు పంపారు. విమానంలోని లావేటరీలో ఒక ప్రయాణికుడు ధూమపానం చేస్తున్నాడని, పదే పదే హెచ్చరించినప్పటికీ వికృతంగా, దూకుడుగా ప్రవర్తించాడని ఎయిర్ ఇండియా పేర్కొంది.












Click it and Unblock the Notifications