పఠాన్ కోట్ ఉగ్రదాడి: దర్గాలో ఎస్పీ డీలింగ్ (ఫోటోలు)

పఠాన్ కోట్/న్యూఢిల్లీ: పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రదాడి కేసులో గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీంద్ సింగ్ విద్రోహ పాత్ర పోషించాడని అనుమానాలు మరింత బలపడుతున్నాయని దర్యాప్తు చేస్తున్న అధికారులు అంటున్నారు.

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాను తరుచుగా పంజ్ పీర్ దర్గాకు వెలుతుంటానని సల్వీందర్ సింగ్ పై అధికారులకు చెప్పారు. దర్గాకు వెళుతున్న సమయంలో ఉగ్రవాదులు తమను కిడ్నాప్ చేశారని సల్వీందర్ సింగ్ ఫిర్యాదు చేశారు.

అయితే సల్వీందర్ సింగ్ ను తాను ఎప్పుడూ చూడలేదని, డిసెంబర్ 31వ తేదిన మొదటి సారి చూశానని దర్గా అధిపతి సోమ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అంతకు ముందు ఎన్నడూ ఆయన ఈ దర్గా దగ్గరకు రాలేదని, ప్రార్థనలు చెయ్యలేదని అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఉదయం నుంచి స్కెచ్

ఉదయం నుంచి స్కెచ్

డిసెంబర్ 31వ తేదిన సల్వీందర్ సింగ్ స్నేహితుడు రాజేష్ వర్మ, ఆయన వంట మనిషి మదన్ గోపాల్ దర్గా దగ్గరకు వచ్చి కొంతసేపు గడిపి వెళ్లిపోయారని సోమ్ పోలీసు అధికారులకు చెప్పారు.

ఫోన్ చేసిన ఎస్పీ

ఫోన్ చేసిన ఎస్పీ

అదే రోజు రాత్రి 8.30 గంటలకు దర్గాను మూసివేసే సమయంలో ఎస్పీ సల్వీందర్ సింగ్ దర్గా అధిపతి సోమ్ కు ఫోన్ చేశారు. తాను వస్తున్నానని, దర్గాను తెరిచి ఉంచాలని చెప్పారని సోమ్ అంటున్నారు.

ఇద్దరితో వెళ్లాడు

ఇద్దరితో వెళ్లాడు

రాత్రి 9 గంటలకు ఎస్పీ ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను వెంట తీసుకు వెళ్లి దర్గాలో అర గంట సేపు గడిపి వెళ్లారని సోమ్ ఎన్ఐఏ అధికారులకు సమాచారం ఇచ్చారు.

మమ్నలి కిడ్నాప్ చేశారని చెప్పిన ఎస్పీ

మమ్నలి కిడ్నాప్ చేశారని చెప్పిన ఎస్పీ

తమను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని ఎస్పీ, ఆయన స్నేహితుడు రాజేష్ వర్మ, మదన్ గోపాల్ చెప్పిన విషయం తెలిసిందే.

రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాకు

రెడ్ అలర్ట్ ఉన్న ఏరియాకు

ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేసిన సందర్బంలో ఎస్పీ ఒంటరిగా ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్లారని ఆరా తీస్తున్నారు.

దొంగ దారిలో వెళ్లారు

దొంగ దారిలో వెళ్లారు

దర్గాకు ప్రధాన రహదారిలో కాకుండా ఎవరూ ప్రయాణించని దారిలో ఎందుకు వెళ్లారని వివరాలు సేకరిస్తున్నారు.

దర్గా దగ్గర పాక్ బూట్ల ముద్రలు

దర్గా దగ్గర పాక్ బూట్ల ముద్రలు

పాకిస్థాన్ లో తయారు అయ్యే ఎఫ్ కాట్ కంపెనీ బూట్ల ముద్రలను దర్గా దగ్గర జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సేకరించారు.

చెక్ పోస్టుల దగ్గర ఎస్కేప్

చెక్ పోస్టుల దగ్గర ఎస్కేప్

చెక్ పోస్టుల దగ్గర ఎక్కడా ఎస్పీ తన కారును ఆపలేదని అధికారుల విచారణలో వెలుగు చూసింది. అలా ఎందుకు చేశారని ఆరా తీస్తున్నారు.

మహిళా పోలీసులపై రేప్

మహిళా పోలీసులపై రేప్

సల్వీందర్ సింగ్ ఎస్పీగా పని చేస్తూ ఐదు మంది మహిళా పోలీసులపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి. అందులో ఇద్దరు మహిళలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

నాతో సంబంధం పెట్టుకో

నాతో సంబంధం పెట్టుకో

తనతో శారీరక సంబంధం పెట్టుకుంటే నీకు వచ్చే నష్టం ఏమిటి అంటూ వేధింపులకు గురి చేశాడని మహిళా కానిస్టేబుల్ లిఖితపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణలో ఉంది.

చాంబర్ నుంచి గెంటివేశారు

చాంబర్ నుంచి గెంటివేశారు

ఓ మహిళా కానిస్టేబుల్ తో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె భయంతో కాలింగ్ బెల్ నొక్కింది. లోపలికి వచ్చిన ఎస్పీ సహాయకులు తనను బయటకు గెంటేశారని మహిళా పోలీసు ఫిర్యాదు చేశారు.

అంతా నేరచరిత్రే

అంతా నేరచరిత్రే

ఎస్పీ మీద నమోదు అయిన కేసులను ఐజీపీ గుర్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మీద గతంలో వచ్చిన ఆరోపణల మీద విచారణ చేస్తున్నామని ఐజీపీ గుర్ ప్రీత్ కౌర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+