అది మోడీ అంటే: ట్వీట్‌పై పవన్, మురళీమోహన్ హ్యాపీ
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను చేసిన ప్రచారానికి పవన్ అందించిన మద్దతు, ఆయన చూపిన ఉత్సాహానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా యువతకు సెల్యూట్ చేశారన్నారు. మోడీ తనను గుర్తుంచుకుని ధన్యవాదాలు తెలియజేయడంపట్ల పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇది వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. మోడీ దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారని బలంగా నమ్ముతున్నానని చెప్పారు.

రాజమండ్రి ఎంపీగా తాను సాధించిన గెలుపు ప్రజల విజయమని ఈ విజయాన్ని ఎన్టీఆర్‌కు అంకితమిస్తున్నానని ప్రముఖ నటుడు మురళీ మోహన్ రాజమండ్రిలో అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపైన ఎంపీ కార్యాలయం నుంచి రూరల్ టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరితో కలసి ఆయన భారీ స్థాయిలో ఈ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు ఓట్లువేసి గెలిపించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సుమారు 25 ఏళ్ళ క్రితం మహనీయుడు ఎన్టీఆర్ తనను రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలని అడిగారని, అప్పట్లో తాను మద్రాసులో ఉన్నానని, తాను రాజమండ్రి వచ్చి పోటీ చెయ్యడం సాధ్యపడలేదన్నారు.
2009లో చంద్రబాబు తనను రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలని కోరడంతో పోటీకి దిగానన్నారు. గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలంతా తనను గెలిపించారన్నారు. తనతోపాటు నియోజకవర్గంలోని టిడిపి, బిజెపి ఎమ్మెల్యేలను గెలిపించారన్నారు.












Click it and Unblock the Notifications