Pawan Kalyan: తమిళ సినిమాలు హిందీలోకి డబ్బింగ్.. పవన్ వ్యాఖలపై డీఎంకే ఫైర్
Pawan Kalyan: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో ప్రస్తుతం సంచలనంగా మారాయి. పవన్ వ్యాఖ్యల నేపథ్యంలో హిందీ భాషా వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య హిందీ వివాదం చెలరేగుతున్న వేళ జనసేన ఆవిర్భావ సభలో తమిళ భాష గురించి పవన్ వ్యాఖ్యలు తమిళనాడులో మంట పుట్టిస్తున్నాయి. తమిళ నాయకులు బాలీవుడ్ నుంచి డబ్బు కోరుకుంటున్నారు కానీ హిందీని అంగీకరించడానికి నిరాకరిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. "తమిళ నాయకులు ఆర్థిక లాభాల కోసం తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయడానికి అనుమతిస్తారు కానీ భాషను వ్యతిరేకిస్తారు" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దేశ సమగ్రత కోసం భారత్ కు తమిళంతో సహా అన్ని భాషలు అవసరమని అన్నారు.
"తమిళనాడు ప్రజలు హిందీ విధించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది నన్ను ఆశ్చర్యపరుస్తుంది. వారు హిందీని కోరుకోకపోతే ఆర్థిక లాభాల కోసం తమిళ చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తారు? వారు బాలీవుడ్ నుంచి డబ్బుకోరుకుంటున్నారు కానీ హిందీని అంగీకరించడానికి నిరాకరిస్తారు. ఇది ఏ రకంగా న్యాయం?" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను స్వాగతించి భాషను తిరస్కరించడం అన్యాయమని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఈ వైరుధ్యం ఎందుకు.. ఈ మనస్తత్వం మారకూడదా అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. హర్యానా, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్ నుంచి వలస కార్మికులకు తమిళనాడు నిలయంగా ఉంది. ఓ సర్వే ప్రకారం లక్షల మంది ఇక్కడికి వలస వచ్చినట్లు తెలిసింది.

త్రిభాషా విధానంపై తమిళనాడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమిళనాడు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడానికి నిరాకరించిందని పేర్కొంటూ.. తమిళనాడు సమగ్ర శిక్ష పథకానికి ఉద్దేశించిన రూ.2,152 కోట్లను నిలిపివేసిన తర్వాత వివాదం మరింత తీవ్రమైంది. తమిళనాడు చాలా కాలంగా త్రిభాషా విధానాన్ని రాష్ట్రంపై హిందీని రుద్దే ప్రయత్నంగా చూస్తోంది. అయితే కేంద్రం ఈ విధానాన్ని యువతకు అన్ని ప్రాంతాలలో ఉపాధి లభించేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది.
పవన్ కల్యాణ్ పై డీఎంకే ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు ఎల్లప్పుడూ ద్విభాషా విధానాన్ని అనుసరిస్తుందని.. తమిళం, ఇంగ్లీషును పాఠశాలల్లో బోధిస్తున్నామని.. పవన్ కల్యాణ్ పుట్టకముందే ఒక బిల్లు ఆమోదించబడిందని డీఎంకే నాయకుడు టీకేఎస్ ఎలంగోవన్ అన్నారు. "మేము 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నాం.. నటులు కాదు.. విద్యా నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని తమిళనాడు ఎల్లప్పుడూ ద్విభాషా సూత్రాన్ని అనుసరించేలా రాష్ట్రంలో చట్టాన్ని ఆమోదించాం.. పవన్ కల్యాణ్ పుట్టకముందే 1968లో ఈ బిల్లు ఆమోదించబడింది. తమిళనాడు రాజకీయాలు పవన్ కు తెలియవు" అని ఎలంగోవన్ అన్నారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను డీఎంకే ప్రతినిధి సయ్యద్ హఫీజుల్లా తోసిపుచ్చారు. తమిళనాడు వైఖరిని ఆయన అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు. తమిళనాడులోని నాయకులు ఎప్పుడూ హిందీ లేదా మరే ఇతర భాష నేర్చుకోవడాన్ని వ్యతిరేకించలేదని.. తమిళ ప్రజలపై హిందీ లేదా మరే ఇతర భాషనైనా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. హిందీని మాపై రుద్దకండని చెప్పడం.. మరొక భాషను ద్వేషించడంతో సమానం కాదన్నారు. తమిళ నాయకులు మాతృభాషను, సాంస్కృతిక గుర్తింపును కాపాడుకోవడం గురించి ప్రయత్నించడం గర్వంగా ఉందన్నారు.
BIG BREAKING NEWS 🚨 Pawan Kalyan asks "Why do you dub Tamil films in Hindi?"
— Simran (@Simran_n_n) March 15, 2025
He said "They seek money from Hindi-speaking states. India needs multiple languages, including Tamil, not just two"
"All Indian languages are part of our culture"
"If anyone attempts to undermine the… pic.twitter.com/45g00BvDJB
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications