వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

pay-at-delivery:మామూలోడివి కాదు గురూ.. బండి దొంగిలించి కొరియర్ చేశాడు, కానీ ...ఆప్షన్

|
Google Oneindia TeluguNews

అప్పుడప్పుడూ చిత్ర, విచిత్రాలు జరుగుతుంటాయి. ఇక లాక్ డౌన్ సమయంలో జరిగిన ఘటనలు గుర్తుండిపోతుంటాయి. ఇందులో విషాద విషయాలు కొన్నైతే.. కొన్ని సరదాగా నవ్వూ తెప్పిస్తుంటాయి. తమిళనాడులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒకతను టూ వీలర్ చోరీ చేశాడు. తన ఇంటికి వెళ్లి.. తర్వాత దానిని యజమానికి పంపించాడు. కానీ పే ఎట్ డెలివరీ ఆప్షన్ పెట్టాడు. అంటే యజమాని తన బండి తీసుకోవాలంటే తిరిగి సొమ్ము చెల్సించాల్సిందే. ఆ కథ, కమామిషు ఏంటో చుద్దాం. పదండి.

 లాక్ డౌన్ 4.0 ముగుస్తున్న వేళ ఏపీలో మరికొన్ని మినహాయింపులు .. ఏపీ ప్రజలకు శుభవార్త లాక్ డౌన్ 4.0 ముగుస్తున్న వేళ ఏపీలో మరికొన్ని మినహాయింపులు .. ఏపీ ప్రజలకు శుభవార్త

బైక్ ప్రత్యక్షం..

బైక్ ప్రత్యక్షం..

కోయంబత్తూరు పల్లపలయంలో సురేశ్ కుమార్ అని లెత్ మిషన్ ఉత్పత్తి చేసే వ్యక్తి ఉంటున్నాడు. ఇతనికి హీరో హోండా స్ప్లైండర్ బైక్ ఉంది. అయితే గత నెల 18వ తేదీన బండిని ఎవరో తీసుకెళ్లిపోయారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి.. ఆ విషయాన్ని సురేశ్ మరచిపోయాడు. కానీ 15 రోజుల తర్వాత కొరియర్ సర్వీస్ నుంచి సురేశ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. కనిపించకుండా పోయిన తన బైక్ ప్రత్యక్షమైంది. దీంతో సురేశ్ కుమార్ ఒకింత సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు.

దొంగిలించి..

దొంగిలించి..

కోయంబత్తూరులో ఓ టీ షాపులో పనిచేసే వ్యక్తి ఉంటున్నాడు. అయితే లాక్ డౌన్ వల్ల పని లేదు. భార్య, బిడ్డలను ఎలా ఊరికి తీసుకెళ్లలేదో తెలియలేదు. ఇంకేముంది సురేశ్ కుమార్ బైక్ దొంగిలించాడు. బైక్ మీద ఊరికి వెళ్లాడు. తర్వాత బండిని కొరియర్ ద్వారా పంపించారు. లాక్ డౌన్ వల్ల అతని వద్ద డబ్బు ఉందో లేదో తెలియదు గానీ.. బండి కొరియర్ చేసి పే ఏట్ డెలివరీ ఆప్షన్ పెట్టాడు. అంటే సురేశ్ కుమార్ బండి తీసుకొని రూ.వెయ్యి వరకు నగదు చెల్లించాలి. అంటే దొంగిలించిన టీ షాపులో పనిచేసే వ్యక్తి మాత్రం డబ్బులు పే చేయలేదు. ఒకవేళ సురేశ్ కట్టకుంటే.. తిరిగి బైక్ వచ్చేది... అప్పుడు టీ విక్రేత వద్ద నుంచి ముక్కుపిండి డబ్బులు వసూల్ చేసేవారు. లేదంటే బండి తమ వద్ద ఉంచుకునేవారు.

ఇలా బయటపడింది

ఇలా బయటపడింది

కుమార్ నగదు కట్టి బండిని తీసుకున్నారు. ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇంతకీ తన బండి దొంగిలించబడిన రోజు ఏం జరిగిందని ఆరాతీశారు. సీసీ టీవీ ఫుటేజీ చెక్ చేయగా.. టీ విక్రేత కనిపించాడు. తన బండిని దొంగలించి... తనకే పర్సెల్ పంపించాడని అనుకొన్నారు. కానీ పే ఏట్ డెలివరీపై మాత్రం లోలోపల బాధపడ్డాడు.

English summary
pay-at-delivery:man working in a tea shop in Tamil Nadu's Coimbatore district ran off with a motorbike in order to ferry his family to his native place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X