జూబ్లీహిల్స్ బైపోల్ లో PCS సర్వే సంచలనం.. వందకు వందశాతం కరెక్ట్..!
ఉత్కంఠభరితంగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. అయితే ఇటీవలి కాలంలో ఎన్నికల్లో సర్వే సంస్థల అంచనాలు విఫలమవుతున్న తరుణంలో కొత్తగా వచ్చిన PCS సర్వే అదరగొట్టింది. ప్రముఖ డిజిటల్ ఛానెల్ స్వేచ్ఛతో కలిసి, PCS సర్వే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నిక ఎగ్జిట్ పోల్ లో PCS సర్వే అక్షర సత్యమైంది. స్థాపించిన తొలి సంవత్సరమే అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పాలిటిక్స్ కమ్యూనికేషన్ అండ్ స్ట్రాటజీస్ (PCS) జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిర్వహించిన సర్వే వందకు వంద శాతం కరెక్ట్ అయింది.
సీనియర్ సెఫాలజిస్టులతో జూబ్లీహిల్స్ పబ్లిక్ పల్స్ అంచనా వేయడంలో విజయం సాధించింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 49 శాతం ఓట్లు గెలుచుకోవచ్చని PCS సర్వే అంచనా వేసింది. 49 శాతానికి 2 శాతం ఓట్లు తగ్గొచ్చు.. లేదా పెరగొచ్చని సర్వే తెలిపింది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి 42 శాతం ఓట్లు రావొచ్చని.. 2 శాతం తగ్గొచ్చు, లేదంటే పెరగొచ్చని సర్వే అంచనా వేసింది.
ఇక బీజేపీకి సైతం 8 శాతం ఓట్లు వస్తాయని అలాగే 2 శాతం తగ్గొచ్చు.. లేదా పెరగొచ్చని విశ్లేషించింది. ఇక ఇతరులకు ఒక శాతం మేర ఓట్లు రావొచ్చని సర్వే ప్రిడిక్షన్ చేసింది. PCS సర్వే చెప్పినట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సుమారుగా 50 శాతం ఓట్లతో 25 వేల మెజార్టీతో ఎన్నికల్లో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లు 1,94,727 కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కు వచ్చిన ఓట్లు 98,988 గా ఉన్నాయి.

PCS అంచనా 51 శాతం.. రియల్ పోలింగ్ లో వచ్చిన 51 శాతం ఓట్లు పీసీఎస్ అంచనా వేసినట్టుగా నవీన్ మెజార్టీ సుమారుగా 25వేలుగా ఉంది. ఇప్పుడు నవీన్ యాదవ్ 24,729 ఓట్లతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 74,259, వచ్చిన పర్సెంటేజ్ 38.13 PCS అంచనా 40 శాతం బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 17,061 వచ్చిన పర్సెంటేజ్ 8.76 PCS అంచనా 8 శాతంగా ఉంది.

మరోవైపు బిహార్ లో ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో సర్వే సంస్థలు విఫలమైనట్లుగా చెప్పవచ్చు. బిహార్ లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని చెప్పినప్పటికీ 200 సీట్లు దాటుతాయని ఏ సర్వే సంస్థ కూడా అంచనా వేయలేదు. దీంతో బిహార్ ఎన్నికలకు సంబంధించి సర్వే సంస్థలు ప్రజల మూడ్ ను అందుకోలేకపోయాయని చెప్పవచ్చు. దాదాపు అన్ని సర్వే సంస్థలు ఎన్డీయేకు 130 నుంచి 167 స్థానాల వరకు వస్తాయని అంచనా వేశాయి. కానీ ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఏకంగా 202 స్థానాలు కైవసం చేసుకోవడం గమనార్హం. ఇక మహాగఠ్ బంధన్ కేవలం 35 స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు ఆరు స్థానాల్లో విజయం సాధించారు. దీంతో బిహార్ లో తొలిసారి బీజేపీ 90 స్థానాల్లో విజయం సాధించి.. రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చరిత్ర సృష్టించింది.












Click it and Unblock the Notifications