సుప్రీంకోర్టుకు రాష్ట్రాల్లో మతఘర్షణల వ్యవహారం-ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ పిటిషన్

శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహించిన శోభాయాత్రలు మతఘర్షణలకు దారితీశాయి. ఇందులో పలువురికి గాయాలకు కావడంతో పాటు ఆస్తులకు కూడా భారీగా నష్టం వాటిల్లింది. దీనిపై ప్రధాని మౌనం వహించడాన్ని విపక్షాలుఇప్పటికే తప్పుబడుతున్నాయి. ఇప్పుడు దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

రామనవమి, హనుమాన్‌ జయంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఊరేగింపుల సమయంలో భక్తులపై దాడులు చేయడం, కాల్పులు, రాళ్లదాడి, వాహనాలను ధ్వంసం చేయడం, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించడం దేశ సార్వభౌమత్వానికి ముప్పు అని న్యాయవాది వినీత్ జిందాల్ దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

petition filed in supreme court seeking NIA inquiry on communal clashes in several states

ఈ ఘర్షణల వెనుక ఐసిస్ తో పాటు తీవ్రవాద శక్తులు ఉన్నాయని, జాతి వ్యతిరేక, అంతర్జాతీయ సంస్ధల పాత్ర ఉందని పిటిషనర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా హిందువులను టార్గెట్ చేసేందుకే ఈ ఘర్షణలకు పాల్పడ్డారని తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఏప్రిల్ 16న హనుమాన్ జయంతి సందర్భంగా జహంగీర్‌పురిలో ఘర్షణలు చెలరేగాయి. అంతకు ముందు రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రామనవమి వేడుకల సందర్భంగా, జేఎన్ యూ క్యాంపస్‌లో కూడా ఘర్షణలు జరిగాయి. వీటిలో తీవ్రవాదుల పాత్ర ఉందని పిటిషనర్ ఆరోపించారు. వీటిపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.

ఢిల్లీలోని జహంగీర్‌పురి అల్లర్లపై సుమోటోగా విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ధర్మాసనానికి న్యాయవాది అమృతపాల్ సింగ్ ఖాల్సా లేఖ పిటిషన్‌ను కూడా సమర్పించారు. ఇప్పటివరకు ఢిల్లీ పోలీసుల దర్యాప్తు పాక్షికంగానే జరిగిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+