వారం రోజులుగా..అదే పనిగా: రూ.120 దాటేస్తోన్నపెట్రోల్: డీజిల్‌పై ఊరట

న్యూఢిల్లీ: పెట్రోల్ ధర మళ్లీ పెరిగింది. మంగళవారం కూడా పెట్రోల్ రేటును చమురు సంస్థలు సవరించాయి. లీటర్‌ ఒక్కింటికి 35 పైసల మేర పెంచాయి. డీజిల్ జోలికి వెళ్లలేదు. డీజిల్ ధరలు యధాతథంగా ఉన్నాయి. అందులో మార్పులు చేయలేదు. పాత రేట్లే ఇవ్వాళ కొనసాగుతున్నాయి. ఇంధన రేట్లను పెంచడం వరుసగా ఇది ఏడోసారి. ఇవ్వాళ డీజిల్‌కు ఈ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చాయి. ప్రతి రోజూ 35 పైసలు, అంతకుమించిన భారం వాహనదారులపై పడుతోంది. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో వీపు విమానం మోత మోగుతోంది.

35 పైసల నుంచి తగ్గట్లే..

35 పైసల నుంచి తగ్గట్లే..


భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తాజాగా చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్‌‌పై 35 పైసల మేర పెంపుదల కనిపించింది. డీజిల్ ధరలో మార్పులు చేయలేదు. అన్ని చమురు కంపెనీలకు ఇవే రేట్లు వర్తిస్తాయి. లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర పెంచడాన్ని బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నాయి. ఆయిల్ కంపెనీలు అక్కడి నుంచి దిగట్లేదు. తాజాగా పెరిగిన ధరలతో దేశంలోని అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ 115 నుంచి 120 రూపాయలుగా నమోదైంది. డీజిల్ 105 నుంచి 110 రూపాయలకు చేరువైంది. కొన్ని చోట్ల పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 120 రూపాయల మార్క్‌ను కూడా దాటేసింది.

 ఢిల్లీ, ముంబైల్లో..

ఢిల్లీ, ముంబైల్లో..

దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.110.04 పైసలకు చేరింది. డీజిల్ రూ.98.42 పైసలు పలుకుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ 115 రూపాయలను దాటేసింది. లీటర్ రూ.115.85 పైసలుగా రికార్డయింది. అక్కడ డీజిల్‌ రూ.106.62 పైసలకు చేరింది. కోల్‌కతలో పెట్రోల్ ధర రూ.110 రూపాయల పైమాటే. ఈ నగరంలో పెట్రోల్ రేటు రూ.110.49 పైసలుగా నమోదైంది. డీజిల్‌ ధర రూ.101.56 పైసలుగా నమోదయింది. చెన్నైలో పెట్రోల్ రూ.106.66 పైసలు, డీజిల్‌ ధర రూ.102.59 పైసలకు చేరింది. డీజిల్‌లో పాత రేట్లే కొనసాగుతున్నాయి.

అక్కడ రూ.118 ప్లస్

అక్కడ రూ.118 ప్లస్

కాగా- బెంగళూరులో పెట్రోల్ రేటు రూ.113.93, డీజిల్ రూ.104.50 పైసలు, భోపాల్‌లో పెట్రోల్ రూ.118.89 పైసలు, డీజిల్ రూ.107.90 పైసలుగా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.114.49 పైసలు, డీజిల్ రూ.107.40 పైసలకు చేరింది. గువాహటిలో పెట్రోల్ రూ.106.12 పైసలు, డీజిల్ రూ.98.36 పైసలు, లక్నోలో పెట్రోల్ రూ.107.09 పైసలు, డీజిల్ రూ.98.91 పైసలుగా రికార్డయింది. గాంధీనగర్‌లో పెట్రోల్ రూ.107.05, డీజిల్- 106.33 పైసలుగా నమోదైంది.

 పెట్రోల్ రూ.120కి పైగా..

పెట్రోల్ రూ.120కి పైగా..

వరుస పెంపుదలతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 120 రూపాయల మార్క్‌ను దాటి పోయింది. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో పెట్రోల్ రూ.121.53 పైసలుగా నమోదైంది. డీజిల్ 110 రూపాయలను దాటింది. పన్నా, సత్నా, రీవా, షాదోల్, ఛింద్వారాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, హనుమాన్ గఢ్‌లల్లో 122 రూపాయలకు చేరింది లీటర్ పెట్రోల్ ధర. శ్రీగంగానగర్‌లో లీటర్ పెట్రోల్ రూ.122.79 పైసలు, డీజిల్ రూ.113.21 పైసలుగా పలుకుతోంది.

మూడు రోజుల్లో రూపాయికిపైగా..

మూడు రోజుల్లో రూపాయికిపైగా..

రేట్లు ఎక్కడికి వెళ్లి ఆగుతాయనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో రేట్లు మరింత వేగంగా పైపైకి దూసుకెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ ఒక్కింటికి 35 పైసల మేర చొప్పున పెంచుతూ వస్తోండటం వల్ల మూడు రోజుల్లోనే ఒక రూపాయిని దాటస్తున్నాయి వాటి ధరలు. ఇలా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. రేట్లు తగ్గే అవకాశం ఏ మాత్రం కూడా కనిపించట్లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+