చిన్నారులే టార్గెట్.. మైనర్లకు రక్షణ కరువైందా..!

సభ్య సమాజంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు దారుణాలకు ఒడిగడుతుండగా.. ఇప్పటికే ఎందరో మహిళలు బలయ్యారు. లేటెస్ట్ గానే గుజరాత్‌ రాష్ట్రం రాజ్‌కోట్‌ జిల్లాలో మానవ విలువలను మంటగలుపుతున్న ఘోర ఘటన సైతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నిర్భయ కేసును తలపించేలా ఏడేళ్ల చిన్నారిపై దారుణ అత్యాచార ప్రయత్నం చేసి, ఆమెను అమానుషంగా గాయపరిచిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఈ సంఘటన డిసెంబర్‌ 4న అట్కోట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామ పక్కన ఉన్న పొలాల్లో జరిగింది.

కుటుంబంతో కలిసి వచ్చిన చిన్నారి...

రోజు వారి కూలీ పనులు చేసుకునే బాలిక తల్లిదండ్రులు ఆ రోజు కూడా పొలంలో పనికి వెళ్లారు. ఆ సమయానికి చిన్నారి వారికంటే కొద్దిదూరంలో ఆడుకుంటూ ఉంది. ఈ నిర్లక్ష్య క్షణాన్నే అవకాశంగా మార్చుకొని.. ఓ వ్యక్తి బాలిక నోటిని మూసివేసి బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లాడు. పొలాల మధ్యనున్న నిర్మానుష్య ప్రదేశానికి బాలికను తీసుకెళ్లి.. అక్కడే అత్యాచారానికి ప్రయత్నించాడు. చిన్నారి భయంతో అల్లాడుతూ కేకలు వేయడంతో నేరస్థుడు మరింత క్రూరంగా వ్యవహరించాడు. ఆమెను నిశ్శబ్దం చేయడానికి... పదునైన వస్తువుతో ఆమె ప్రైవేట్ భాగాన్ని దారుణంగా గాయపరచి అక్కడికక్కడే వదిలి పారిపోయాడు. బాలిక తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడిపోయింది.

physical-assault-attempt-on-seven-years-old-girl-at-gujarath

కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. తరువాత ఆమెను పొలంలోని దూర ప్రాంతంలో రక్తస్రావంతో కుప్పకూలి పడి ఉన్న స్థితిలో చూసి.. వెంటనే రాజ్‌కోట్‌ సివిల్‌ హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ,వైద్యులు పలువురు స్పెషలిస్టుల పర్యవేక్షణలో చికిత్సను కొనసాగిస్తున్నారు.

ఇక ఈ ఘటనపై పోలీసులు తక్షణమే దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలు, స్థానికుల సమాచారాన్ని ఆధారంగా తీసుకుని నిందితుడిని గుర్తించారు. అతడు మధ్యప్రదేశ్‌కు చెందిన రాంసింగ్‌ టెర్సింగ్‌ (30). బాలిక తల్లిదండ్రులతో కలిసి కూలీ పనికి వచ్చినట్లు తెలుస్తోంది. నేరాన్ని ఒప్పుకున్న అతడిని అదుపులోకి తీసుకొని సాక్ష్యాలతో పాటు కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు ఈ ఘటన తర్వాత గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఏపీలో ఘటనలు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐ.పోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక (ఆరవ తరగతి విద్యార్థిని)పై పలుమార్లు అఘాయిత్యం జరిగినట్టు బయట పడింది. కాగా సదరు బాలిక చదువుతున్న స్కూల్ సమీపంలోని ఒక భవనంలోకి తీసుకువెళ్లి.. జనసేన నాయకుడు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)బట్టలు విప్పి వికృతి చేష్టలు చేసినట్టు గుర్తించారు.

అంతకు ముందుకాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హంసవరం ప్రాంతానికి చెందిన నారాయణరావు అనే వృద్ధుడు.. స్థానిక గురుకుల పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి మైనర్ బాలికను హాస్టల్ నుంచి "ఇంటికి తీసుకెళ్తాను" అని చెప్పి.. సమీపంలోని సపోటా తోటలోకి తీసుకెళ్ళాడు. ఓ యువకుడు ఈ విషయాన్ని గమనించి వీడియో తీస్తూ వారిని ప్రశ్నించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ తర్వాత బాలిక గ్రామస్థులు నారాయణరావును పట్టుకుని దేహశుద్ది చేశారు. మంత్రులు నారా లోకేష్, అనిత కూడా దీనిపై స్పందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచేందుకు పోలీసులు తీసుకెళ్తున్న క్రమంలో బహిర్భూమికి వెళ్లాలని చెప్పి నారాయణరావును వాహనాన్ని ఆపారు.. ఆ తర్వాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+