మధ్యప్రదేశ్‌లో గమ్మత్తు: విమానం రోడ్డుపై దిగింది

Madhya Pradesh map
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డుపై ఓ చిన్నపాటి విమానం దిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే జాతీయ రహదారిపై విమానం దిగింది. ఆ విమానం అత్యవసరంగా రోడ్డుపై దిగినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన మంగళవారంనాడు చోటు చేసుకుంది.

విమానంమ ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడడం వల్ల ఆ విమానం రోడ్డుపై దిగినట్లు చెబుతున్నారు. అది ఫోర్ సీటర్ విమానం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో గల బెతుల్ ప్రాంతంలో ఆ విమానం ల్యాండైంది.

ఎన్నారై వ్యాపారి శ్యాం వర్మకు చెందిన ఈ విమానాన్ని బెతుల్ - నాగపూర్ జాతీయ రహదారిపై పైలట్ సురక్షితంగా దింపాడు. అంతకు ముందు విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి ఆ సమాచారాన్ని అధికారులకు చేరవేశాడు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వైపులా రహదారిపై వాహనాలను అర గంట పాటు నిలిపేశారు. ఆ సమయంలో జాగ్రత్తగా విమానాన్ని పైలట్ కిందికి దింపాడు.

ఇరు వైపులా వాహనాలను ఆపే వరకు విమానం గాలిలో చక్కర్లు కొడుతూ ఉండిపోయింది. నిజానికి, విమానం వర్మకు చెందిన టైర్ ఫ్యాక్టరీ రన్‌వేపై దిగాల్సి ఉండింది. ఎదురుగా బలమైన గాలి వీయడంతో రోడ్డుపై విమానాన్ని పైలట్ దించక తప్పలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+