బంగారం విక్రయాలపై కేంద్రం సంచలన నిర్ణయం
ఏప్రిల్ 1వ తేదీ తరువాత మీరు మీ బంగారాన్ని విక్రయిస్తే మీకు కేవలం రూ.పది వేల నగదు మాత్రమే ఇస్తారు.
న్యూఢిల్లీ: బంగారం విక్రయాలపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ అవసరాల కోసం మీ వద్ద ఉన్న బంగారాన్ని అత్యవసరంగా అమ్మాలనుకుంటున్నారా.. ఆగండి.. ఆగండి.. ఏప్రిల్ 1వ తేదీ తరువాత మీరు మీ బంగారాన్ని విక్రయిస్తే మీకు కేవలం రూ.పది వేల నగదు మాత్రమే ఇస్తారు.
మిగిలిన మొత్తాన్ని మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారట. అత్యవసరం దృష్ట్యా వైద్యం కోసమో లేదా ఇతర కుటుంబ అవసరాల కోసమో మీ వద్ద ఉన్న బంగారన్ని నగదుగా మార్చుకోవాలనుకుంటే ఇదీ పరిస్థితి.

బ్యాంకు మీ డబ్బు ఇచ్చేదాకా మీరు వేచి చూడాల్సిందే. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో సవరణలు తీసుకురానుంది. ఈ కొత్త నిబంధన వల్ల బంగారం వ్యాపారం దెబ్బ తినే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications