ఎవరి బలం ఎంతమంది ఎమ్మెల్యేలు?: పన్నీరు వెంట ఇద్దరే
పార్టీ చీఫ్ శశికళ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంట ఎంతమంది ఉన్నారనే చర్చ సాగుతోంది.
చెన్నై: అన్నాడీఎంకేలో తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ చీఫ్ శశికళ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంట ఎంతమంది ఉన్నారనే చర్చ సాగుతోంది.
పార్టీ కార్యాలయంలో శశికళ నిర్వహించిన సమావేశానికి 129 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరో ఇద్దరు ముందస్తుగా సమాచారం ఇచ్చి, హాజరు కాలేదని అన్నాడీఎంకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పన్నీరు సెల్వం వెంట మిగిలింది ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నట్లుగా చెబుతున్నారు. పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడిన సమయంలోను ఆయన వెంట ఇద్దరు ఎమ్మెల్యేలే ఉన్నారు.అన్నాడీఎంకేకు 134 మంది బలం ఉంది. అందులో హాజరైన 129 మంది, సమాచారం ఇచ్చి రాని ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి శశికళకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

కాగా, తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుతం పన్నీర్‌సెల్వంతో కలిపి అన్నాడీఎంకేకు 134 మంది, డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్‌కు 8 మంది, 2 స్థానాల్లో ఇతరులు ఉన్నారు. జయలలిత మరణంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. పన్నీరు వైపు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలుస్తోంది.
ఇంత జరుగుతుంటే గవర్నర్ ఏం చేస్తున్నారు: సుబ్రహ్మణ్య స్వామి
తమిళనాడులో ఇంత జరుగుతుంటే గవర్నర్ విద్యాసాగర రావు ఏం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు. ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ స్పందించకుంటే ఆయనను రాష్ట్రపతి డిస్మిస్ చేయాలన్నారు. శశికళను సీఎం చేయడానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications