మోడీ గురువు కన్నుమూత: దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని..

Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: ప్రధాని మోడీ తన గురువుగా భావించే ప్రఖ్యాత రామకృష్ణ మఠం మిషన్ అధ్యక్షుడు స్వామి ఆత్మస్థానందజీ మహరాజ్(98) కన్నుమూశారు. వృద్ధాప్యంలో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం సాయంత్రం 5గం.కు రామకృష్ణ సేవా ప్రతిష్ఠాన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

బేలూరు మఠంలో సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు రామకృష్ణ మఠం పేర్కొంది. ఆత్మస్థానందజీ ఇక లేరన్న విషయం తెలియగానే ప్రధాని మోడీ దిగ్భ్రాంతికి గురయ్యారు. వ్యక్తిగతంగా ఇది తనకు పూడ్చలేని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆత్మస్థానందజీతో ఉన్న అనుబంధాన్ని మోడీ మరోసారి గుర్తు చేసుకున్నారు.

తన జీవితంలో అత్యంత కీలక దశలో ఆత్మస్థానందజీ వద్ద గడిపినట్లు తెలిపారు. తానెప్పుడూ కోల్ కతా వెళ్లిన ఆయన ఆశీస్సులు తీసుకునేవాడినని ట్విట్టర్ ద్వారా స్పందించారు. అపారమైన జ్ఞాన సంపద ఆత్మస్థానందజీ సొంతమని, భవిష్యత్ తరాలు ఆయన్ను గుర్తుంచుకుంటాయని అన్నారు.

కాగా, యువకుడిగా ఉన్నప్పుడు తొలిసారి మోడీ బేలూరు మఠంలోని ఆత్మస్థానందజీ వద్దకు వెళ్లారు. ఆయన వద్ద శిష్యుడిగా చేరాలనుకున్నప్పటికీ.. ఏ కారణం చేతనో ఆయన్ను అక్కడ చేర్చుకోలేదు. నువ్వుండాల్సింది ఇక్కడ కాదని, నీకు వేరే చోట నుంచి పిలుపు వస్తుందని మోడీతో స్వామిజీ చెప్పారు. ఆ తర్వాత ఆత్మస్థానందజీ నుంచి మోడీ ఆధ్యాత్మికతను అలవరుచుకున్నారు. అదే క్రమంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi on Sunday condoled the demise of the head of the Ramakrishna Math and Mission, Swami Atmasthananda, terming it as a "personal loss".
Please Wait while comments are loading...