PM Kisan: రైతులకు శుభవార్త.. అక్టోబర్ 5న రైతుల ఖాతాల్లోకి డబ్బులు..!
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. త్వరలో పీఎం కిసాన్ పథకం డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17 విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 34 వేలు జమ చేశారు.
17వ విడతను జులై 18, 2024న విడుదల చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ.9.26 వేల కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. అక్టోబర్ 5న 18 విడత పీఎం కిసాన్ నిధులను అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్ యోజన పథకంలో రైతులకు డబ్బులు రావాలంటే.. తప్పనిసరిగా ఇ కేవైసీ చేసుకోవాలి. ఇ కేవైసీ చేసుకున్న అన్నదాతలకే డబ్బులు జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇ కేవైసీ పూర్తి చేసుకోలేని వారు చేసుకోవాలి అధికారులు కోరుతున్నారు.

దీని కోసం రైతులు https://pmkisan.gov.in/ వెబ్ సైట్ కు వెళ్లాలి. అందులో లెఫ్ట్ సైడ్ ఇ కేవైసీ ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. మీరు ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఇ కేవైసీ పూర్తి అయినట్లు.
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కొనసాగిస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తోంది. ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరాకు రూ.15 వేలు చెల్లించనున్నారు. అయితే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కాలేదు. దీనిపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు చాలా మంది రైతులు రుణ మాఫీ లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హతలున్నా రుణ మాఫీ కాలేదని వాపోయారు.












Click it and Unblock the Notifications