వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలపక్ష సమావేశానికి ప్రధాని గైర్హాజరు : రైతు చట్టాలు మళ్లీ తెస్తారా..క్లారిటీ ఇవ్వాలి : కాంగ్రెస్ డిమాండ్..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో, కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్ల‌మెంట్ అనుబంధ భవ‌నంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లంద‌రూ హాజ‌ర‌య్యారు. మొత్తం 31 పార్టీలకు చెందిన 42 మంది నేత‌లు స‌మావేశంలో పాల్గొన్నారు. అయితే, కొన్ని అనివార్య కార‌ణాల రీత్యా ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ మాత్రం ఈ స‌మావేశానికి రాలేదు. ఈ అఖిల‌ప‌క్ష భేటీకి ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి కేంద్ర‌మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయెల్‌, అర్జున్ రామ్ మేఘవాల్ హాజ‌ర‌య్యారు. సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో, కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. పార్ల‌మెంట్ అనుబంధ భవ‌నంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లంద‌రూ హాజ‌ర‌య్యారు. మొత్తం 31 పార్టీలకు చెందిన 42 మంది నేత‌లు స‌మావేశంలో పాల్గొన్నారు. అయితే, కొన్ని అనివార్య కార‌ణాల రీత్యా ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ మాత్రం ఈ స‌మావేశానికి రాలేదు. ఈ అఖిల‌ప‌క్ష భేటీకి ప్ర‌భుత్వం త‌ర‌ఫు నుంచి కేంద్ర‌మంత్రులు ప్రహ్లాద్ జోషి, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయెల్‌, అర్జున్ రామ్ మేఘవాల్ హాజ‌ర‌య్యారు.

వివిధ పార్టీల నుంచి మల్లికార్జున‌ ఖర్గే, అధిర్ రంజన్ చౌధ‌రి, ఆనంద్ శర్మ, సతీష్ చంద్ర మిశ్రా, సుదీప్ బందోపాధ్యాయ‌, డెరెక్ ఓ'బ్రియన్, నామా నాగేశ్వ‌ర్ రావు, రాంగోపాల్ యాద‌వ్‌, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, పశుపతి పరాస్, అనుప్రియా పటేల్, సంజయ్ సింగ్, రామ్‌దాస్ అథవాలే, తిరుచ్చి శివ, విజయ సాయి రెడ్డి, ఫరూక్ అబ్దుల్లా త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆల్‌పార్టీ మీట్లో మొత్తం 31 పార్టీలు పాల్గొన్నాయ‌ని కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషి చెప్పారు. ఆయా పార్టీల నుంచి మొత్తం 42 మంది నేత‌లు హాజ‌రై నిర్మాణాత్మ‌క చ‌ర్చ‌లు జ‌రిపార‌ని తెలిపారు.

PM Modi absent in all party meeting, Congress express doubt that Govt to bring back the farm laws

రాజ్య‌స‌భ ఛైర్మ‌న్‌, లోక్‌స‌భ స్పీక‌ర్ అనుమ‌తించిన ఏ అంశంపైన అయినా చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉన్న‌ద‌ని జోషి చెప్పారు. అయితే, స‌భ‌లు స‌జావుగా సాగేందుకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే ప్రధాని అఖిలపక్ష సమావేశానికి రాకపోవటం పైన స్పందించారు. తాము తెచ్చిన చట్టాలపై రైతులను ఒప్పించలేక..ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని చెప్పారని..మరలా భవిష్యత్ లో ఈ చట్టాలు తెచ్చే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసారు. కోవిడ్ -19 కారణంగా మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల పరిహారం ఇవ్వాలని ఖర్గే డిమాండ్ చేసారు. అదే విధంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరారు.

Recommended Video

Omicron : PM Modi High Level Review On New Variant || Oneindia Telugu

పార్లమెంట్ సమావేశాల మొదటి రోజునే ప్రధాని ప్రకటించిన విధంగా రైతు చట్టాలను ఉప సంహరించుకుంటూ కేంద్రం ఆ బిల్లులను ఉపసంహరించుకుంటూ సభలో ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ఈ చట్టాలను ఉపసంహరించుకుంటూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక, ఇదే సమయంలో సభ్యులంతా హాజరు కావాలంటూ కాంగ్రెస్ మూడు లైన్ల విప్ జారీ చేసింది. గత సమావేశాలు రైతు చట్టాల ఉప సంహరణ డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు సభను అడ్డుకున్నాయి. ఇక, ఇప్పుడు రైతు చట్టాల ఉప సంహరణ నిర్ణయం తీసుకోవటంతో....ప్రతిపక్షాలు సభ నిర్వహణలో సహకరిస్తాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది.

English summary
Prime Minister Modi have not attended the all party meeting and congress had expressed the doubt that the farmlaws will be brought back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X