మాటల్లో కాదు, ఇక చేతుల్లోనే - మోదీ మాస్ వార్నింగ్..!!
పాకిస్థాన్ పై ప్రధాని మోదీ మరోసారి మండిపడ్డారు. హెచ్చరిక చేసారు. కశ్మీర్‌లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని పాకిస్థాన్ కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు దేశం పర్యాట కానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పేదలపై పాక్ కుట్రలు చేస్తోందని మండి పడ్డారు. తద్వారా ఇక్కడి పేదల పొట్టగొట్టాలని పాక్ చూస్తోందని దుయ్యబట్టారు. ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేదిలేదని ప్రధాని స్పష్టం చేశారు. పాక్ కుయుక్తులను ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతూనే ఉంటుందన్నారు.
చినాబ్ వంతెన ప్రారంభం సందర్భంగా కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలకోపన్యాసం చేశారు. భారతీయ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్ రైల్వే తీగల వంతెన ఒక నిదర్శనం కొడియాడారు. కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న కల నేటికి సాకార మైందని చెప్పుకొచ్చారు. దేశంలో మత కల్లోలాలు సృష్టించాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్ ఉన్నట్లు ఆయన ఆరోపించారు. జీవనోపాధి కోసం పర్యాటకంపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజలను పాకిస్థాన్ దోచుకున్నదని తెలిపారు. పొరుగుదేశం మానత్వానికి, సామరస్యానికి, పర్యాటకానికి శత్రువుగా తయారైందని ఆరోపించారు. పెహల్గామ్‌లో మానవత్వం, కశ్మీరతత్వంపై పాకిస్థాన్ అటాక్ చేసింద న్నారు. కశ్మీర్ ప్రజల ఆదాయాన్ని దోచుకునేందుకు టూరిస్టులపై పాక్ దాడికి పాల్పడిందన్నారు.

ఇకపై ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్థాన్ కు ఓటమి గుర్తుకువస్తుందన్నారు. ఉగ్ర వాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదని స్పష్టం చేశారు. అయితే ఈ పోరాటంలో జమ్మూకశ్మీర్ యువత ఐక్యంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. అలాగే భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ చేసిన దాడుల్లో ఇళ్లు దెబ్బతిన్నవారికి అదనంగా రూ.2 లక్షలు అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల కోసం రూ.1 లక్ష ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మోదీ చెప్పుకొచ్చారు. జమ్మూకశ్మీర్ సహా దేశాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు పేదలను రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications