మీ ప్రయత్నం మరవం: నజరబయేవ్ వర్సిటీలో మోడీ

కజకిస్తాన్: ఐక్య రాజ్య సమితిలో భారత్‌కు సభ్యత్వం కోసం కజకిస్తాన్ ప్రయత్నం మరువలేనిదని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు అన్నారు. నజరబయేవ్ విశ్వవిద్యాలయం విద్యార్థులతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

కజకిస్తాన్ పురోభివృద్ధిలో నజరబయేవ్ విశ్వవిద్యాలయం పాత్ర మరువలేనిదని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం తర్వాత మరో దానిని ఎంచుకోలేమని చెప్పారు. భారత్, మధ్య ఆసియాలు ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయన్నారు. రక్షణ, భద్రత అంశాల పైన ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయన్నారు.

PM Modi addresses students in Nazarbayev University

అంతకుముందు ఉజ్జెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో హిందీ విద్యార్థులు, భారతీయులతో ప్రధాని మోడీ ముఖాముఖి నిర్వహించారు. ఉజ్జెకిస్తాన్‌లో భారతీయ భాషలు, సినిమాలు, సంగీతం ఖ్యాతి చెందాయన్నారు. 50 ఏళ్లపాటు ఉజ్జెకిస్తాన్ రేడియోలో హిందీ ప్రసారాలు జరగడం గొప్ప విషయమని చెప్పారు.

ఆందోళనల నుంచి స్వేచ్ఛ లభించాలంటే సంగీతం మంచి మార్గమని, మనిషి హింసామార్గం వైపు వెళ్లకుండా సంగీతం నిరోధిస్తుందన్నారు. భాషను పరీక్షిస్తే దాని హృదయం చాలా విశాలంగా ఉంటుందన్నారు. దేశాల మధ్య సాంస్కృతిక బంధం చాలా ముఖ్యమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+