పాక్ గుండెల్లో ఫిరంగులు: తిరుగులేని మిషన్
యావత్ దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకొంటోంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలతో రెపరెపలాడుతోంది. నయా భారత్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకొంటున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం.
పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తోన్నారు. తన ప్రసంగంలో ఆపరేషన్ సింధూర్ ను ప్రస్తావించారు ప్రధాని మోదీ. శత్రువులను అంచనాలకు మించిన స్థాయిలో దెబ్బతీశామని, వాళ్ల వెన్ను విరిచామని అన్నారు.

ఆపరేషన్ సింధూర్ హీరోలకు సెల్యూట్ చేశారు. పాకిస్తాన్‌లో జరిగిన భారీ విధ్వంసం గురించి వివరించారు. పహల్గామ్ మారణకాండకు ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టామని అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన సరిహద్దులు దాటుకుని భారత భూభాగంపైకి ప్రవేశించిన ఉగ్రవాదులు మతం గురించి ఆరా తీసి మరీ మారణకాండకు పాల్పడ్డారని ప్రధాని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా ఓ భారీ మిషన్ ను ప్రకటించారు ప్రధాని మోదీ. అదే- సుదర్శన్ చక్ర మిషన్. 2035 నాటికి ఇది కార్యరూపం దాల్చనుంది. శత్రువుల నుండి దేశాన్ని సమర్థవంతంగా రక్షించేందుకు, అత్యంత ఖచ్చితత్వంతో ప్రతిదాడి చేయడానికి రూపొందించిన అధునాతన ఆయుధాలు, నిఘా వ్యవస్థలకు సంబంధించిన మిషన్ ఇది.
శ్రీకృష్ణుడి దివ్యాయుధం సుదర్శన చక్రం నుండి ఈ మిషన్‌ను ప్రేరణగా తీసుకున్నారు. రెడ్ ఫోర్ట్ పై ప్రసంగం సందర్భంగా సుదర్శన చక్ర మిషన్ గురించి వెల్లడించారు ప్రధాని మోదీ. శ్రీకృష్ణుడి నుంచి ప్రేరణ పొంది జాతీయ భద్రతా కవచాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
మిషన్ సుదర్శన్ చక్ర పేరుతో ఓ అత్యాధునిక రక్షణ వ్యవస్థను డెవలప్ చేయనున్నట్లు చెప్పారు. ఈ మిషన్- అధునాతన యుద్ధ సామర్థ్యాలతో కూడిన అతి గొప్ప వ్యవస్థగా రూపుదాల్చుతుందని పేర్కొన్నారు. శత్రువుల లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలుగుతుందని, మరింత శక్తిమంతంగా ప్రతిదాడి చేయగలుగుతుందని చెప్పారు. అత్యాధునిక ఆయుధాలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తుందని స్పష్టం చేశారు.
2035 నాటికి దేశవ్యాప్తంగా రైల్వే ప్లాట్‌ఫారాలు, ఆసుపత్రులు, మతపరమైన ప్రదేశాలతో సహా కీలకమైన బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్థంతో కూడిన ప్రాంతాలన్నింటినీ ఈ జాతీయ భద్రతా కవచం కిందకు తీసుకువస్తామని ప్రధాని ప్రకటించారు. సాంప్రదాయిక సైనిక ప్రాంతాలకు మించి సమగ్ర రక్షణను విస్తరించాలని సంకల్పించినట్లు వెల్లడించారు.
మిషన్ సుదర్శన్ చక్ర ఆవిష్కరణ ప్రధాన అంశం అయినప్పటికీ- ఇది స్వదేశీ రక్షణ సాంకేతికతకు అద్దం పట్టినట్టవుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. తేజస్ Mk1A యుద్ధ విమానాలకు GE ఇంజిన్‌ల సరఫరాలో అమెరికా జాప్యం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications