Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు మరింత తీవ్రతరం చేశఆరు. మంగళవారం ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన రాజస్థాన్‌లో చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా మరోమారు వివాదాస్పదమైన మాటలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మత స్వేచ్ఛ ఉండదని చెప్పిన ప్రధాని మోదీ ప్రజల సంపదను కొన్ని సెలెక్టివ్ వర్గాలకు మాత్రమే పంచేందుకు కుట్ర చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవే వ్యాఖ్యలు రాజస్థాన్‌లోని బన్స్‌వారాలో జరిగిన సభలో కూడా చేశారు. ప్రజల సంపదపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ కూటమి పార్టీలు తనను తిట్టే కార్యక్రమం చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఓ కుట్రకు తెరతీస్తోందన్న వాస్తవాన్ని దేశప్రజల ముందు ఉంచానని టాంక్‌లో జరిగిన ర్యాలీలో మోదీ చెప్పారు. కాంగ్రెస్ చేస్తున్న కుటిల రాజకీయాలను మూడురోజుల క్రితమే తాను బహిర్గతం చేసినట్లు చెప్పిన ప్రధాని.. కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. అంతేకాదు కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై కూడా ఘాటు విమర్శలు చేసిన ప్రధాని మోదీ ఆ పార్టీ తన విధానాలను ఎందుకు దాచి ఉంచుతోందని ప్రశ్నించారు. దేశంలోని సంపదపై సర్వే చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేసిన మోదీ.. సంపదను రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారన్న విషయాన్నే తాను ప్రస్తావించినట్లు పేర్కొన్నారు.

PM Modi Claims Listening to Hanuman Chalisa a Crime Under Congress Rule

తాను ఎప్పుడైతే కాంగ్రెస్ రహస్యాన్ని బయటపెట్టాడో... లోలోపల దాగిన అసలు కాంగ్రెస్ అజెండా బయటపడిందని చెప్పారు. దీంతో కాంగ్రెస్ నేతలకు చెమటలు పడుతున్నాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో మనకిష్టమొచ్చిన దైవాన్ని కొలిచే స్వేచ్ఛ ఉండదని చెప్పారు. హనుమాన్ ఛాలీసా విన్నాకూడా అదేదో నేరం కింద పరిగణించే పరిస్థితులు వస్తాయని జోస్యం చెప్పారు ప్రధాని మోదీ.దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఘనంగా జరుపుకుంటున్న వేళ మోదీ కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలిచాయి.

రాజస్థాన్‌లో సంతానం గురించి మాట్లాడుతూ పరోక్షంగా ముస్లిం సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన ప్రధాని మోదీపై తెలంగాణ ఎమ్మెల్యే మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు. కేవలం ముస్లిం కుటుంబాల్లోనే సంతానం ఎక్కువగా ఉందా అని ప్రశ్నించిన అక్బరుద్దీన్... మోదీ, అమిత్ షా, యోగీ ఆదిత్యనాథ్‌లకు ఎంతమంది అక్క చెల్లెళ్లు, అన్నాతమ్ముళ్లు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు. బీజేపీ మోదీ తమ రాజకీయ స్వలాభం కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అక్బరుద్దీన్ మండిపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+