వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం.. ఏయే అంశాలు చర్చించారంటే..?

|
Google Oneindia TeluguNews

ఆఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే సన్నాహాల్లో తాలిబన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు.

Deepika Padukone:పసుపు రంగు చీరలో బోల్డ్ బ్యూటీ (ఫొటోస్)Deepika Padukone:పసుపు రంగు చీరలో బోల్డ్ బ్యూటీ (ఫొటోస్)

తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. పౌరులపై ఆంక్షలు, విభేదించిన వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ విషయంలో భారత్ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోడీ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

pm modi conduct highlevel meeting at his residence

ఇతర దేశాలతోపాటు భారత్‌తో కూడా తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నట్లు ఇదివరకు తాలిబన్లు ప్రకటించారు. ఆ తర్వాత దోహాలోని రాయబార కార్యాలయంలో భారత రాయబారి దీపత్ మిట్టల్‌తో కూడా భేటీ అయ్యారు. ఆఫ్ఘన్ గడ్డ మీద నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరగకుండా చూడాలని ఈ భేటీలో తాలిబన్లకు భారత్ స్పష్టంగా చెప్పింది.

మరోవైపు తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న వేళ అక్కడ మహిళలు కొందరు ధైర్యం చేసి రోడ్డెక్కి తమ హక్కుల కోనం నినదిస్తున్నారు. గతంలో తాలిబన్ల పాలనలో ఎంతో వివక్ష ఎదుర్కొన్న అక్కడి మహిళలు ఈసారి మాత్రం తమ హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని తాలిబన్లకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ సమీక్షించారు. ఆప్ఘన్‌లో జరుగుతున్న పరిణామాలను నిశీతంగా గమనిస్తున్నారు.

English summary
prime minister narendra modi conduct high level meeting at his residence. home minister amit shah, defence minister rajnath singh, nsa ajit doval attended
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X