వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుందేల్ ఖండ్‌పై మోడీ వరాల జల్లు.. రూ.20 వేల కోట్ల ప్యాకేజ్, రక్షణ కారిడార్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లక్నో: అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్‌పై బుధవారం ప్రధాని మోడీ వరాల జల్లు కురిపించారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్ల ప్యాకేజ్‌తోపాటు రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను కూడా ఆయన ప్రకటించారు.

బుధవారం లక్నోలో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్-2018 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్ లో ప్రస్తావించిన రెండు రక్షణ కారిడార్లలో ఒకదాన్ని బుందేల్ ఖండ్ కు కేటాయించామని తెలిపారు.

pm-modi

యూపీలో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. 'ఒక రాష్ట్రం ఒక ఉత్పత్తి' అనే కొత్త పాలసీని ఆయన ప్రశంసించారు. రక్షణ కారిడార్ కేటాయింపుతో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మోడీ చెప్పారు. జేవార్, కుశినగర్ ప్రాంతాల్లో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాలు వస్తాయని అన్నారు.

ఒకవైపు విభజన హామీలు అమలు చేయాలంటూ ఏపీలో ఉవ్వెత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ సమస్యలు తీర్చకుండానే బుందేల్ ఖండ్‌పై వరాలు కురిపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమకు న్యాయం చేయాలని ఇంత ఆందోళన చేస్తున్నా... పట్టించుకోని మోడీ బుందేల్ ఖండ్‌కు రూ.20 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించడం ఏపీ ప్రజల్ని మరింత ఆగ్రహానికి గురిచేయక మానదనే వ్యాఖ్యనాలు వినిపిస్తున్నాయి.

English summary
Terming the two-day investors’ summit and the encouraging response of top industrial houses to it as a manifestation of a huge positive change brought about by Yogi Adityanath government in Uttar Pradesh, Prime MinisterNarendra Modi awarded one of the two proposed defence industrial corridors to Bundelkhand region of the state. The corridor, he claimed, was expected to draw an investment of nearly Rs 20,000 crore while creating five lakh jobs in the days to come. “It will revive the fortunes of Bundelkhand pushing the region on path of immense possibilities of development,” said PM Modi. Even before the summit could take off, Yogi Adityanath government had already signed 1045 Memorandum of Understanding (MoUs) to the tune of Rs 4.28 lakh with private investors with 2.5 lakh sustainable job possibilities as claimed by the CM himself while delivering the welcome speech in the inaugural session of the summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X