రైతాంగానికి మోదీ సర్కార్ ఓ వరం?

PM Modi: సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. పలు దేశాల ఆర్థిక వ్యవస్థ తలకిందులయింది. క్రూడాయిల్, రసాయనిక ఎరువులు వంటి అత్యవసర ఇంధనాల కొనుగోళ్ల విషయంలో తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోన్నాయి.

భారత్‌పైనా అలాంటి దుష్ప్రభావాలు పడినా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. కఠిన సవాళ్లు ఎదురైన సమయాల్లో ధరలను అదుపులో ఉంచడంలో, అవి స్థిరంగా కొనసాగేలా చేయడంలో చెప్పుకోదగ్గ ఆర్థిక వ్యూహాలను ప్రదర్శించగలిగింది.

PM Modi govt has demonstrated notable fiscal prudence to manage prices and ensure stability

స్వదేశంలో ఆర్థిక సమతుల్యతను కాపాడుకుంటూ క్రూడాయిల్, యూరియా వంటి కీలక వనరుల కోసం భారత్.. అస్థిరతలో చిక్కుకున్న ప్రపంచ మార్కెట్‌ను ఎలా నావిగేట్ చేసిందనేది ఈ కథనం సారాంశం.

ముడిచమురు, యూరియా విషయంలో భారత్‌కు ప్రధాన సరఫరాదారులు రష్యా, ఉక్రెయిన్‌లే. ఈ రెండు దేశాలు కూడా సుదీర్ఘకాలంగా యుద్ధాన్ని కొనసాగిస్తోన్నాయి. సై అంటే సై అంటోన్నాయి. ఏ దేశం కూడా తల వంచట్లేదు. వెనక్కి తగ్గట్లేదు.

ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాల సరఫరా వ్యవస్థపై తీవ్రంగా పడింది. సప్లై చైన్ అనేది తీవ్రంగా దెబ్బతిననది. అనేక సవాళ్లను విసిరింది. ముడి చమురు, యూరియా.. ఈ రెండింటిని కూడా దిగుమతి చేసుకోవడంలో భారత్ మాత్రం ఎక్కడా ఇబ్బందులకు గురి కాలేదు. అంతరాయాన్నీ చవి చూడాల్సిన దుస్థితి తలెత్తలేదు.

ఈ విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న దౌత్య వ్యూహాలు అత్యంత కీలకపాత్రను పోషించాయి. చమురు దిగుమతులు మునుపటి కంటే ఊపందుకున్నాయనడంలో సందేహాలు అక్కర్లేదు. ముడిచమురు దిగుమతికి సంబంధించిన డేటా.. దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

భారత్‌కు శతాబ్దాల కాలం నుంచీ అతిపెద్ద క్రూడాయిల్ సరఫరాదారుగా ఉంటూ వస్తోంది రష్యా. ఇంతకు ముందు ఎప్పుడూ లేనవిధంగా ముడిచమురు దిగుమతి శాతం 20కి చేరింది. గతంలో ఈ సంఖ్య రెండు శాతం మాత్రమే.

ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్నప్పటికీ క్రూడాయిల్ సరఫరాలో ఆ పరిస్థితి తలెత్తనివ్వకుండా ముందుచూపుతో వ్యవహరించగలిగింది మోదీ ప్రభుత్వం. ఇది- దేశ దౌత్య వ్యూహాలకు మచ్చుతునక. ఇటీవలి కాలంలో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురు భారీగా ఉండటమే దీనికి ఉదాహరణ.

బద్ధశతృవులైన రష్యా- ఉక్రెయిన్‌లను మోదీ ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారనేది ఆసక్తికరం. రష్యా, ఉక్రెయిన్.. రెండింటితో సంబంధాలను బలోపేతం చేయడంపై మోదీ ప్రభుత్వం దృష్టి సారించడం ఇక్కడ ప్రధానాంశమైంది. ఈ సప్లై చైన్ అనేది ఎక్కడా చెక్కుచెదరకుండా ఉంచడంలో దౌత్యపరమైన వ్యూహాలు కీలకంగా మారాయి.

పెరుగుతున్న అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్థిక చర్యలను తీసుకుంటూ వచ్చింది. రాయితీలనూ కల్పించింది. ఆర్థిక పతనం నుంచి వినియోగదారులు, రైతులను రక్షించడానికి మోదీ ప్రభుత్వం అనేక చర్యలను అమలు చేసింది. సబ్సిడీ కార్యక్రమాల మరింత విస్తరింపజేయడం ఈ కీలక వ్యూహాల్లో ఒకటి.

PM Modi govt has demonstrated notable fiscal prudence to manage prices and ensure stability

ఇంధన ధరలను స్థిరీకరించడంలో క్రూడాయిల్ రాయితీలు కీలక పాత్ర పోషించాయి. మోదీ ప్రభుత్వం ప్రకటించిన యూరియా సబ్సిడీ- ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా నిరోధించగలిగింది. గత సంవత్సరాలతో పోల్చుకుంటే యూరియాకు సబ్సిడీ రెండింతలు పెరిగింది. ఈ కష్ట సమయాల్లో వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

2024 యూఎస్ ఎన్నికల్లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ఓ ప్రధానాంశంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్-ఆఫ్‌, అందులో ఎదురయ్యే సవాళ్లు అనేవి ఈ సబ్సిడీలపై ప్రభావం చూపొచ్చు. ఈ పరిస్థితుల్లో రాయితీలను కొనసాగించడానికి అవసరమైన నిధులను ఉద్యోగాల కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంఘిక సంక్షేమం వంటి ఇతర కీలకమైన అంశాల నుంచి మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీర్ఘకాలిక పెట్టుబడుల కంటే స్వల్పకాలిక ఉపశమనానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం తీసుకోవలసిన కష్టమైన నిర్ణయాలను ఈ ట్రేడ్-ఆఫ్ హైలైట్ చేస్తోంది. రష్యా- ఉక్రెయిన్ రెండింటితో బలమైన సంబంధాలను కొనసాగించడం ద్వారా భారత్.. ప్రపంచ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో తన సప్లై చైన్‌ను మరింత స్థిరీకరించుకోగలిగింది.

క్రూడాయిల్, యూరియా వంటి కీలక రంగాలలో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడంపై దృష్టి పెడుతోంది మోదీ ప్రభుత్వం. ఈ వ్యూహాత్మక మార్పు ప్రపంచ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరించగలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+