కశ్మీర్‌లో కొత్త చరిత్ర, నెరవేరిన వందేళ్ల కల - మోదీ ఖాతాలో మరో మైలురాయి.!!

జమ్ము కాశ్మీర్ లో వందేళ్ల కల నెరవేరింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన ను ప్రధాని మోదీ ప్రారంభించారు. బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్​ లో తొలి సారి పర్యటనకు వచ్చారు. ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వేలింక్ ప్రాజెక్టులో భాగంగా చినాబ్‌ వంతెన నిర్మాణం చేశారు. దీనిని ఈఫిల్​ టవర్​ కంటే 35 మీటర్ల ఎత్తులో నిర్మించారు. వాస్తవానికి ఈ చీనాబ్ రైల్వే వంతెన 359 మీటర్ల ఎత్తు, 1,315 మీటర్ల పొడవుతో కలిగి ఉంది. దీని వల్ల జమ్మూ-శ్రీనగర్ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది.

జమ్మూకశ్మీర్‌లో చినాబ్‌ రైల్వే బ్రిడ్జిని ప్రధాని మోదీ అట్ట హాసంగా ప్రారంభించారు.ఇది ఢిల్లీలోని కుతుబ్‌ మినార్‌ కంటే 5 రెట్ల ఎత్తు ఉంటుంది. ఇక ప్యారిస్‌లోని ప్రపంచ వింత అయిన ఈఫిల్‌ టవర్‌ను కూడా తలదన్నేలా ఈ చినాబ్‌ రైల్వే వంతెన ఉంటుంది. చినాబ్‌ నదిపై నిర్మితమైన ఈ వంతెనను భారతీయ రైల్వే చరిత్రలో ఇంజినీరింగ్ అద్భుతంగా భావిస్తున్నారు. పర్వతాలను చీల్చుకుంటూ, లోయలను దాటుకుంటూ ఎన్నో వంతెనలు, సొరంగాల ద్వారా ప్రయాణికులను గమ్యానికి చేరుస్తుంది ఈ రైల్వే లైన్‌. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్క్‌ బ్రిడ్జ్‌. గంటకు 266 కి.మీ వేగంతో గాలులు వీచినా వంతెన చెక్కుచెదరదు. ఈ రైల్వే బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో కట్రా - శ్రీనగర్‌ మధ్య 3 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది.

pm-modi-inaugurates-the-chenab-bridge-the-worlds-highest-railway-bridge

ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్​లోని కట్రాలో రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్ట్​లనకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తొలుత చినాబ్​ రైల్వే వంతెన వద్దకు చేరుకున్న ప్రధాని వ్యూ పాయింట్ నుంచి వంతెనను పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను అధికారులు ఫొటో ప్రజంటేషన్ ద్వారా మోదికి వివరించారు. ఐకానిక్ బ్రిడ్జ్‌ వద్ద ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియంను ప్రధాని సందర్శించారు. ఉధంపుర్‌-శ్రీనగర్‌-బారాముల్లా రైల్వే లింక్‌ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న ఇంజినీర్లు, కార్మికులతో కూడా ప్రధాని ముచ్చటించారు. కట్రా-శ్రీనగర్, కశ్మీర్‌-కట్రా వందేభారత్ రై‌ళ్లకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+