ఉగ్రవాదంపై పీఎం మోదీ తాజా వ్యాఖ్యలు యుద్ధ సంకేతాలా? పాకిస్థాన్ కు దబిడి దిబిడేనా!
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు ఉగ్రవాదంపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల పైన, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. తాజాగా ఆయన అంగోలా ప్రెసిడెంట్ జావో లూరెన్కోతో భేటీలో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ వంటి దేశాలకు బుద్ధి చెప్పే వ్యూహంలో మోదీ
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పర్యాటకులపైన ఉగ్రవాదులు జరిపిన మారణకాండను దేశం ఇంకా మరిచిపోలేదు. ఉగ్ర మూకల కాల్పులలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఈ దారుణ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వంటి దేశాలకు బుద్ధి చెప్పే ప్రయత్నాన్ని మొదలు పెట్టింది.

టెర్రరిజంపైన ఉక్కుపాదం మోపే ప్లాన్ లో మోదీ
పాకిస్తాన్ పైన కఠినమైన చర్యలకు ఉపక్రమించిన భారత్ ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. యుద్ధభేరి మోగించింది. ఇప్పటికే పాకిస్తాన్ భారత్ సరిహద్దుల వద్ద యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్ర దాడిని చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే టెర్రరిజం పైన ఉక్కు పాదం మోపడానికి మోదీ రంగంలోకి దిగారు.
మరోమారు టెర్రరిజం పైన మోదీ ఆగ్రహం
భారత్ కి మద్దతుగా అనేక దేశాలు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా అంగోలా ప్రెసిడెంట్ జావో లూరెన్కో ప్రధాని మోదీని కలిసి మాట్లాడారు. ఢిల్లీలో ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు టెర్రరిజం పైన విరుచుకుపడ్డారు. మానవాళి మనుగడకు టెర్రరిజం చాలా ప్రమాదకారిగా మారిందని, భారత్ తో పాటు అంగోలా కూడా నమ్ముతుంది అన్నారు.
LIVE: PM Shri @narendramodi and President João Lourenço of Angola at the joint press meet. https://t.co/0oYhHDYeSq
— BJP (@BJP4India) May 3, 2025
భారత్ కు అండగా అంగోలా
టెర్రరిస్టుల పైన టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని దృఢ నిశ్చయంతో తాము ఉన్నామని స్పష్టం చేశారు. సరిహద్దుల దగ్గర టెర్రరిజాన్ని అరికట్టడంలో మాకు సహకరిస్తున్న అంగోలా కు కృతజ్ఞతలు అంటూ, అంగోలా మద్దతు భారత్ కు లభిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో 40 సంవత్సరాలుగా రెండు దేశాలు భాగస్వామ్యంలో కలిసి ముందుకు నడుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య సత్సంబంధాలు వెల్లడించిన మోదీ
అంగోలా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఇండియా నమ్మకంతోనూ, స్నేహంతో ను అండగా నిలిచిందని, ఆఫ్రికన్ దేశాల నుంచి గత పది సంవత్సరాలు తమకు ఎంతో సహకారం అందిందని, తమ వ్యాపారం 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఆఫ్రికాలో 17 కొత్త ఎంబసీలను తెరిచామని, ఎనిమిది దేశాలలో ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లను ప్రారంభించామని పేర్కొన్నారు. ఓ ఐదు దేశాలలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో కూడా సహకరిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications