వేడిని తగ్గించే సాంప్రదాయ పానీయాలు.. ప్రధాని మోదీ చెప్పిన ఆసక్తికర విషయాలు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్‌లో దేశవ్యాప్తంగా తీవ్రమైన వేడి మరియు హీట్ వేవ్ పరిస్థితులను ప్రస్తావించి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన సాంప్రదాయిక భారతీయ పానీయాలను ఉపయోగించి వేడిని తగ్గించుకోవాలని సూచించారు.

ఎండల తీవ్రతపై మాట్లాడిన ప్రధాని మోదీ

ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వేడి ఉందని, ఎండలు మండుతున్నాయని అన్నారు. మండే ఎండలు, వేడి గాలుల విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తరచూ నీళ్లు తాగాలి. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను కూడా పాటించాలి అని చెప్పారు.

PM Modi Mann Ki Baat Heatwave Tips and said about interesting traditional summer drinks

వేడిని ఎదుర్కొనే సహజ మార్గాలపై మోదీ ప్రస్తావన

ఇక భారతీయ వంటగదుల్లోనే వేడిని ఎదుర్కొనే సహజ మార్గాలు ఉన్నాయని తెలిపారు. వేసవి వచ్చేసరికి ఇంట్లో పానీయాలు మారిపోతాయని, మట్టి కుండల నీళ్లు, పెరుగుతో చేసిన మజ్జిగ, కాచిన మామిడి పళ్ల షర్బత్ వంటివి సిద్ధం చేసి సాంప్రదాయిక పానీయాలు తయారు చేసుకోవాలని సూచించారు. ప్రధాని మోదీ భారతదేశ వైవిధ్యభరిత సంస్కృతిని ప్రస్తావిస్తూ, వివిధ రాష్ట్రాల సాంప్రదాయిక పానీయాలను ఉదాహరణగా చెప్పారు.

దేశంలో వేడిని తగ్గించే పానీయాలను చెప్పిన మోదీ

ఉత్తర భారతదేశంలో ఆమ్ పన్నా (కాచిన మామిడి శరబత్) ప్రసిద్ధి చెందిందని, ఇది వేడిని తగ్గించి శరీరానికి చల్లదనం ఇస్తుందని తెలిపారు. పంజాబ్, హర్యానాలో పెద్ద గ్లాసుల్లో లస్సీ, రాజస్థాన్-గుజరాత్‌లో చాచ్ (మజ్జిగ) రోజువారీ ఆహారంతో పాటు తీసుకుంటారని చెప్పారు.

వివిధ షర్బత్ లపై మోదీ ఆసక్తికర విషయాలు

బీహార్, ఝార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో సత్తు శరబత్ శక్తినిస్తూ పొట్టను నింపుతుందని ప్రస్తావించారు. సత్తు షర్బత్ శనగలను వేయించి పొడి చేసిన దానితో తయారు చేస్తారు. అలాగే కొంకణ్, గోవాలో కోకం పండుతో చేసే శరబత్, దక్షిణ భారతదేశంలో పానకం, కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ సోడా వంటివి తాగుతారని చెప్పారు. ఒడిషాలో బేల్ పన్నా వంటి పానీయాలు స్థానిక సంస్కృతి భాగమని వివరించారు.

సూపర్ న్యూస్.. సబర్బన్, ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు మెట్రో రేంజ్ సౌకర్యాలు!
సూపర్ న్యూస్.. సబర్బన్, ఎంఎంటీఎస్ రైల్వే ప్రయాణికులకు మెట్రో రేంజ్ సౌకర్యాలు!

సాంప్రదాయక సమ్మర్ పానీయాలను చెప్పిన మోదీ

ఈ సాంప్రదాయిక పానీయాలు కేవలం వేడి నుంచి ఉపశమనం మాత్రమే కాకుండా, భారతదేశ వైవిధ్యాన్ని, 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' భావనను ప్రతిబింబిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. వేసవిలో ఈ దేశీయ పానీయాలను ఎక్కువగా ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దేశవాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మరిన్ని అంశాలపై కూడా మాట్లాడారు. వేడి కాలంలో ప్రజలు ఎక్కువ నీళ్లు తాగడం, సూర్యకాంతి నుంచి రక్షణ కోసం సరైన దుస్తులు ధరించడం, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించడం వంటి అంశాలపై ఆయన మాట్లాడటం ఆధునికతతో , సాంప్రదాయ అలవాట్లని కూడా గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+