రిలాక్స్.....దైవ సన్నిధిలో పీఎం నరేంద్రమోడీ.. కేదార్‌నాథ్ అలయంలో పూజలు, అనంతరం సమీక్ష

దేశ వ్యాప్తంగా ఏడు విడుతలుగా జరిగిన పోలీంగ్‌ ప్రచారానికి శుక్రవారంతో గడువు ముగియడంతో ఆదివారం తుదిదశ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ప్రచారం ముగియంతో నాయకులు దైవబాట పట్టారు. ప్రచారం చేశాము గెలుపు భారం మీదే అంటూ వారివారి వ్యక్తిగత దైవాలను కోరుకుంటున్నారు.ఇందులో భాగంగానే దేశ ప్రధాని గత రెండు నెలలుగా ప్రచారం చేసిన అనంతరం నేడు ఉత్తారాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.అయితే ఎన్నికమిషన్ అనుమతితోనే ఆలయాన్ని దర్శించుకున్న మోడీ కోడ్‌కు విరుద్దంగా ఆలయ అభివ‌ృద్దిపై సమీక్ష నిర్వహించారు.

నా ప్రయత్నం నేను చేశాను...ఇక దేవుడిదే భారం....

నా ప్రయత్నం నేను చేశాను...ఇక దేవుడిదే భారం....

ఎన్నికల్లో తుది దశ ప్రచారం ముగినన అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దైవభక్తిలో మునిగిపోయాడు..ఆయన శనివారం కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు.శనివారం ఉదయం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఆయన జోలి గ్రాంట్ ఏయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుండి నేరుగా కేదార్‌నాథ్ అలయానికి చేరుకున్నారు.అనంతరం గుడి చుట్టు ప్రదక్షిణ చేశారు. తర్వాత ఆలయ గర్బగుడిలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు.

ప్రత్యేక ఆకర్షణగా మోడీ

సాధరణంగా డ్రెస్సులకు అంత్యంత ప్రాధాన్యత ఇచ్చే మోడీ ఆలయ దర్శనంలో కూడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దర్శనంలో భాగంగా మాత్రం ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను పాటించారు. ఇందులో భాగంగానే బ్లూ కలర్ చోలా వేసుకున్న మోడీ నెత్తిన టోపీ ,మెడలో భారీ శాలువను ధరించారు.కాగా నడుముకు ఎర్రటి కండువా చుట్టుకుని గుడిచుట్టు ప్రదక్షిణలు చేశారు. గుళ్లో పూజలు చేసిన అనంతరం బయటికి వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుడుని దర్శించుకున్నారు.మోడీ రాక సంధర్భంగా ఆలయం నిర్వాహకులు గుడి చుట్టు ఎర్రటీ తివాచీ పరిచారు. ఆలయ నిర్వాహకులు మోడీ కి శాలువ బహుకరించారు. కాగా ఆయన రేపు కూడ ఉత్తరాఖండ్ లోనే పర్యటించనున్నారు.

రాంత్రంతా ఆలయంలోనే ప్రధాని మోడీ

కాగా రెండు రోజులపాటు మోడీ అక్కడే గడపనున్నారు. ఈరోజు కేదార్‌నాథ్ వద్ద ఉన్న గుహాను సందర్శించిన అనంతరం రాత్రంతా కూడ గుహలోనే నిద్రించనున్నారు.కాగా గత నవంబర్‌లో కూడ మోడీ ఆలయాన్ని దర్శించుకుని అక్కడే ఉన్నారు. కేదారీనాథ్ గుడికి ప్రధానిగా నాల్గవ సారీ వెళ్లిన నరేంద్ర మోడీ ఈ సంవత్సరంలోనే రెండు సార్లు దర్శించుకున్నారు.

ఆలయ అభివ‌ృద్దిపై సమీక్షలు నిర్వహించిన మోడీ

మోడీ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ నిర్మాణం జరుపుతున్న ఆదిశంకరాచార్య మందిరం పై సమీక్ష నిర్వహించారు.అయితే ఆలయానికి వెళ్లేందుకు మోడీ ఎన్నికల అనుమతిని కోరాడు..దీంతో అనుమతిని ఇచ్చిన ఈసీ అభివ‌ృద్దిపనులపై సమీక్షలు, సమావేశాలుగాని నిర్వహించవద్దని సూచించింది. మార్చి 10నుండి ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని ఈసీ అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+