అయోధ్య తీర్పు: ఇది ఏ ఒకరి విజయమో, పరాజయమో కాదు, ప్రధాని మోడీ
అయోధ్య తుది తీర్పును మరికొన్ని గంటల్లో సుప్రీంకోర్టు వెలువరించనుండంతో ప్రధాని మోడీ స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై సముచిత గౌరవం ఉంచుదామని ట్వీట్ చేశారు. సమాజంలోని అన్ని వర్గాలు, సామాజిక ఆర్థిక వర్గాలు, అన్నీ పార్టీలు కూడా సంయమనం పాటించాలని కోరారు. ఇదివరకు హింసను ప్రేరేపించిన వారు కూడా సంయమనంగా ఉండాలని కోరారు. అయోధ్య వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏ తీర్పు ఇచ్చిన మనమంతా కట్టుబడి ఉండాలన్నారు. సంయమనంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అయోధ్య భూ వివాదానికి సంబంధిచిం సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా మనమంతా స్వాగతించాలని కోరారు. ఇది ఏ ఒకరి విజయమో, పరాజయమో కాదని పేర్కొన్నారు. దేశంలో ప్రజలందరు సంయమనంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. తమ సాంప్రదాయాన్ని, శాంతి, సామరస్యాన్ని కొనసాగించి దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని కోరారు. మనమంతా ఐకమత్యంగా ఉండి దేశానికి మరింత మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
अयोध्या पर कल सुप्रीम कोर्ट का निर्णय आ रहा है। पिछले कुछ महीनों से सुप्रीम कोर्ट में निरंतर इस विषय पर सुनवाई हो रही थी, पूरा देश उत्सुकता से देख रहा था। इस दौरान समाज के सभी वर्गों की तरफ से सद्भावना का वातावरण बनाए रखने के लिए किए गए प्रयास बहुत सराहनीय हैं।
— Narendra Modi (@narendramodi) November 8, 2019
देश की न्यायपालिका के मान-सम्मान को सर्वोपरि रखते हुए समाज के सभी पक्षों ने, सामाजिक-सांस्कृतिक संगठनों ने, सभी पक्षकारों ने बीते दिनों सौहार्दपूर्ण और सकारात्मक वातावरण बनाने के लिए जो प्रयास किए, वे स्वागत योग्य हैं। कोर्ट के निर्णय के बाद भी हम सबको मिलकर सौहार्द बनाए रखना है।
— Narendra Modi (@narendramodi) November 8, 2019
अयोध्या पर सुप्रीम कोर्ट का जो भी फैसला आएगा, वो किसी की हार-जीत नहीं होगा। देशवासियों से मेरी अपील है कि हम सब की यह प्राथमिकता रहे कि ये फैसला भारत की शांति, एकता और सद्भावना की महान परंपरा को और बल दे।
— Narendra Modi (@narendramodi) November 8, 2019

అయోధ్య భూ వివాదం గత కొన్నేళ్లుగా సాగుతుంది. దీనిపై 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై కక్షిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో చాలా పిటిషనర్లు ఇంప్లీడ్ అయ్యారు. భూ వివాదం పరిష్కారం కోసం కమిటీని కూడా నియమించారు. తర్వాత 40 రోజులపాటు సుప్రీంకోర్టు వాదనలు అలకించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 17వ తేదీన రంజన్ గొగొయ్ పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో తీర్పు వెలువరిస్తామని సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు 9వ తేదీన శనివారం తీర్పునిస్తామని స్పష్టంచేసింది.












Click it and Unblock the Notifications