పాకిస్తాన్ పై ప్రధాని మోదీ గర్జన
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. దేశం ఎదుర్కొంటోన్న పలు అంశాల మీద ప్రతిపక్షాలు లోక్ సభను స్తంభింపజేశాయి. అధికార ఎన్డీఏ కూటమిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాయి. కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో స్పీకర్ ఓం బిర్లా.. సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్, జితేంద్ర సింగ్, ఎల్ మురుగన్ తో కలిసి పార్లమెంట్ భవన ప్రాంగణంలో విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అంతరిక్షం, రక్షణ, నక్సలిజం సహా వివిధ రంగాలలో భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావించారు.

ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రధాని మోదీ చెప్పారు. ఉగ్రవాదులను అణచివేస్తామని తేల్చి చెప్పారు. ఉగ్రవాదులను భారత్ పై ఉసిగొల్పే వారిని వదిలిపెట్టమనీ స్పష్టం చేశారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు దారుణ హత్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే- దేశవ్యాప్తంగా అనేక జిల్లాలు నక్సలిజం నుండి విముక్తి పొందాయని మోదీ చెప్పారు. హింసకు వ్యతిరేకంగా దేశం విజయం సాధిస్తోందని పేర్కొన్నారు. రెడ్ కారిడార్లుగా ఉంటూ వచ్చిన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడు 'గ్రీన్ గ్రోత్ జోన్లు'గా రూపాంతరం చెందుతున్నాయి చెప్పారు.
ఈ వర్షాకాల సమావేశాలు విజయోత్సవాలకు వేదికగా నిలుస్తాయని అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఈ ఆపరేషన్ ద్వారా తన శక్తి సామార్థ్యాలను ఆర్మీ.. ప్రపంచ దేశాలకు తెలియజేసిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో వంద శాతం విజయాలను సాధించామని ప్రకటించారు. 22 నిమిషాల్లోనే ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశామని చెప్పారు.
మేడిన్ ఇండియా వల్లే ఇది సాధ్యపడిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మేడిన్ ఇండియా వైపు మొగ్గు చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో తయారవుతున్న ఆయుధాల పట్ల ప్రపంచ దేశాల అధినేతల్లో ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆక్సియం 4 మిషన్‌ను నడిపిన గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా సాధించిన విజయాలను ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆ మిషన్ కు శుభాంషు శుక్లా నాయకత్వాన్ని వహించడం దేశానికి గర్వకారణమని, ఐఎస్ఎస్ పై జాతీయ జెండాను ఎగురవేయడం ప్రతి భారతీయుడు గర్వపడే క్షణమని ప్రశంసించారు.
ఈ మిషన్.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇతర సరికొత్త ఆవిష్కరణల పట్ల యువతను మరింత ప్రోత్సహించినట్టవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆక్సిమ్ 4 మిషన్ ను పార్లమెంట్ ఉభయ సభల్లో అన్ని రాజకీయ పార్టీల సభ్యులు ముక్తకంఠంతో కొనియాడుతారని ఆశిస్తున్నానని చెప్పారు.
కాగా- పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ , ఎయిర్ ఇండియా 171 విమాన ప్రమాదం వంటి అనేక కీలక అంశాలపై ప్రతిపక్ష ఇండియా కూటమి.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీయడానికి రంగం సిద్ధం చేసుకుంది.
-
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications