వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళన వద్దు.. అప్రమత్తతే ముఖ్యం.. ఒమిక్రాన్‌పై ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. భారత్‌లో ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒమిక్రాన్‌ వల్ల ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలి. ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఒమిక్రాన్‌ వేరియంట్‌పై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలన్నారు.

జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. ఈ సమయంలో ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని, కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో పెరిగిపోతున్నాయని హెచ్చరించారు. మాస్క్‌లు ఉపయోగించాలి.. బౌతికదూరం పాటించాలని కోరారు. ప్రభుత్వం ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.

 pm modi speech india will soon launch nasal vaccine

ఒమిక్రాన్ కట్టడికి భారత్ సిద్దంగా ఉందని మోడీ వివరించారు. కరోనా వైరస్ ఇప్పటికీ ఉందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవడమే మార్గం అని చెప్పారు. ఇవాళ క్రిస్మస్, వాజ్ పేయి జన్మదినం అని చెప్పారు. ఆ సందర్భంగా బూస్టర్ డోసు, ఇతర అంశాల గురించి ప్రకటన చేశానని వివరించారు.

ఒమిక్రాన్ బెంబేలెత్తిస్తోన్న వేళ.. జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ప్రజలు.. పాత ఏడాదికి వీడ్కోలు పలికి.. న్యూ ఇయర్‌కు వెల్ కం చెప్పేందుకు ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు. అయితే గుంపులు గుంపులుగా ఉండటంతో.. ప్రమాదం అని.. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ అప్రమత్తతే శ్రీరామ రక్ష అని వివరించారు. ప్రజలు అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా మాస్క్ దరించాలని.. చేతులను శుభ్రంగా కడుక్కొవాలని కోరారు.

ఇటు ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హైకోర్టు ఆదేశాల మేరకు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధించింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించుకునే సమావేశాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.

English summary
Prime Minister Narendra Modi today announced that india will soon launch nasal vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X