Union Budget 2025: బడ్జెట్ ప్రాధాన్యతలు- మోదీ అంచనాలు..!!
Parliament Budget Sessions: ప్రధాని మోదీ బడ్జెట్ పైన కీలక అంచనాలు వెల్లడించారు. నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆర్దిక మంత్రి నిర్మలా సీతా రామన్ రేపు 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్ పైన అన్ని రంగా ల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. కాగా, బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ ప్రధాని తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వెల్లడించారు. ఈ బడ్జెట్ ద్వారా యువతకు- ఇన్నోవేషన్స్ కు ప్రాధాన్యత దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.
ప్రధాని మోదీ బడ్జెట్ సమావేశాల వేళ దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలపై.. లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము మూడో సారి అధికారంలోకి వచ్చిన తరువాత మరింత బాధ్యతాయుతంగా ప్రజాకాంక్షలు నెరవేర్చేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. మహిళలు - యువతకు అండగా నిలిచేలా నిర్ణయాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ప్రధాని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. పలు ముఖ్యమైన బిల్లులను ఈ సారి సమావేశాల్లో చర్చకు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు.

బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని ప్రధాని మోదీ కోరారు. ఈ బడ్జెట్ వికసిత్ భారత్‌కు ఊతం ఇస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇన్నొవేషన్, ఇన్‌క్లూషన్, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యంతో ముందు కు వెళ్తున్నట్లు ప్రధాని వివరించారు. వక్ఫ్, బ్యాకింగ్, రైల్వే వంటి రంగాల్లో 16 కీలక బిల్లులను సభ ముందు ప్రతిపాదించనున్నారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ప్రధాని స్పష్టం చేసారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ సారి బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ దిశగా కీలక అడుగు పడుతుందని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications