Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: రోడ్డు మధ్యలో కాన్వాయ్‌ను నిలిపివేసిన ప్రధాని మోదీ - అనూహ్యంగా..!!

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. అక్టోబర్ చివరి నాటికి గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంల- ఆయన పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తోన్నారు. సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సమాయాత్తమౌతోన్నారు.

 మెట్రో రైలులో ప్రయాణం..

మెట్రో రైలులో ప్రయాణం..

36వ నేషనల్ గేమ్స్‌ను అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో ఇదివరకే ప్రారంభించారు. నేషనల్ గేమ్స్‌కు గుజరాత్ ఆతిథ్యాన్ని ఇస్తోండటం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అహ్మదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఇది తొలి విడత ప్రాజెక్ట్. అనంతరం ముఖ్యమంత్రి భూపేన్ పటేల్‌తో కలిసి కాలుపూర్ నుంచి దూరదర్శన్ కేంద్ర స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారాయన.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్..

అంతకుముందు- వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా జెండా ఊపి ప్రారంభించారు. గాంధీనగర్ నుంచి ముంబై సెంట్రల్ వరకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ఇది. వందేభారత్ ప్రాజెక్ట్‌లో ఇది మూడో రైలు. ఇదివరకు న్యూఢిల్లీ-వారణాశి, న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలెక్కింది. ఇప్పుడు తాజాగా గాంధీనగర్-ముంబై సెంట్రల్ మధ్య అందుబాటులోకి వచ్చింది. వారంలో ఆరు రోజులపాటు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఆదివారం మినహాయింపునిచ్చారు.

ముంబై సెంట్రల్ టు..

ముంబై సెంట్రల్ టు..

16 బోగీలు ఉన్న ఈ ఎక్స్‌ప్రెస్ సీట్ల సామర్థ్యం 1,128. గాంధీనగర్ దాటుకుంటే అహ్మదాబాద్, వడోదర, సూరత్ మధ్య మాత్రమే ఈ రైలు హాల్ట్ సౌకర్యం ఉంది. ఆదివారం మినహాయించి వారంలో ప్రతిరోజూ తెల్లవారు జామున 6:10 నిమిషాలకు ముంబై సెంట్రల్ నుంచి బయలుదేరే ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 12:30 గంటలకు గాంధీనగర్‌కు చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2:05 నిమిషాలకు గాంధీనగర్ నుంచి బయలుదేరి రాత్రి 8:35 నిమిషాలకు ముంబై సెంట్రల్‌కు చేరుకుంటుంది.

అనూహ్య ఘటన..

అనూహ్య ఘటన..

తన పర్యటన సందర్భంగా ఆయన గాంధీనగర్ రాజ్‌భవన్‌లో బస చేశారు. కాగా- అహ్మదాబాద్ దూరదర్శన్ సెంటర్‌లో బహిరంగ సభను ముగించుకుని గాంధీనగర్‌ రాజ్‌భవన్‌కు రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్తోన్న సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గాంధీనగర్ వైపునకు ఓ అంబులెన్స్ దూసుకెళ్లడానికి ప్రయత్నించగా.. ప్రధాని మోదీ దానికి దారి ఇచ్చారు. దీనికోసం తన కాన్వాయ్‌ను పక్కకు తీసుకున్నారు.

 అంబులెన్స్ కోసం..

అంబులెన్స్ కోసం..

తాను ప్రయాణిస్తోన్న నల్లరంగు ఎస్‌యూవీ కారును రోడ్డుకు ఎడమవైపున నిలిపివేశారు. తన కారుతో పాటు దాని ముందు వెళ్తోన్న పైలెట్ వెహికల్, ఇంకో రెండు వాహనాలు కూడా రోడ్డు పక్కకు ఆగిపోయాయి. అంబులెన్స్ దాటుకుని వెళ్లిన తరువాతే- ప్రధాని మోదీ కాన్వాయ్ ముందుకు కదిలింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను గుజరాత్ భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+